టేకాఫ్ అయిన 13 నిమిషాలకే.. సముద్రంలో కూలిన విమానం.. 188మంది మృతి

ఇండోనేషియా దేశానికి ఏదో శాపం తగిలినట్టుంది. ఇదివరకే వారి విమానమొకటి గల్లంతై ఆచూకీ కూడా కనిపించలేదు. అప్పట్లో ఓ విమానం సముద్రంలో కూలిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ లెన్స్ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకర్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. Serpihan pesawat Lion Air JT 610 yang jatuh di […]

Advertisement
Update: 2018-10-28 23:00 GMT

ఇండోనేషియా దేశానికి ఏదో శాపం తగిలినట్టుంది. ఇదివరకే వారి విమానమొకటి గల్లంతై ఆచూకీ కూడా కనిపించలేదు. అప్పట్లో ఓ విమానం సముద్రంలో కూలిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్ ఎయిర్ లెన్స్ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకర్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే ఈ విమానం కూలిపోయింది. ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్ ఎయిర్ విమానం సుమిత్ర దీవుల్లోని పంగ్కల్ షినాంగ్ నుంచి టేకాఫ్ అయ్యింది. అయిన 13 నిమిషాలకే ఇంజన్ లో లోపం తలెత్తి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో విమానం కోసం గాలించిన అధికారులు అది జువా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు నిర్ధారించారు.

తీరానికి సమీపంలో విమానశకలాలను అధికారులు గుర్తించారు. విమానంలోని ప్రయాణికుల పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బతికున్నారా అన్న దానిపై ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. విమానం కుప్పకూలిన ప్రాంతంలో శకలాల గుర్తింపును నేవీ అధికారులు ట్విట్టర్ లో షేర్ చేశారు.

Tags:    
Advertisement

Similar News