జగన్‌పై దాడి.... ఏబీ వెంకటేశ్వరరావు అసహనపు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, నిఘా సంస్థల పనితీరుపై చాలా రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ యంత్రాంగం రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి కాకుండా రాజకీయ అంశాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు తదితర అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో ఎన్నికల వేళ 100 మంది ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బందిని హైదరాబాద్‌లో మోహరించారు. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కూడా జరగడంతో మరోసారి పోలీసులు, ఇంటెలిజెన్స్ పనితీరు చర్చకు వచ్చింది. ఈనేపథ్యంలో ఇంటెలిజెన్స్ […]

Advertisement
Update: 2018-10-26 04:40 GMT

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, నిఘా సంస్థల పనితీరుపై చాలా రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ యంత్రాంగం రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి కాకుండా రాజకీయ అంశాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు తదితర అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.

తెలంగాణలో ఎన్నికల వేళ 100 మంది ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బందిని హైదరాబాద్‌లో మోహరించారు. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కూడా జరగడంతో మరోసారి పోలీసులు, ఇంటెలిజెన్స్ పనితీరు చర్చకు వచ్చింది. ఈనేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ తిరిగి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.

జగన్‌పై హత్యాయత్నాన్ని చిన్న అంశంగా కొట్టిపారేశారు. మీడియా చానళ్లకు పనీ పాట లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. న్యూస్‌ చానళ్లపై కంట్రోల్ ఉండాలన్నారు. చిన్న విషయాన్ని పట్టుకుని గంటల తరబడి చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Similar News