కొత్తమీరతో అనేక ప్రయోజనాలు!

 నాన్‌వెజ్ కూరలను గార్నిష్ చేయడం కోసమే కొత్తమీర పనికి వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కొత్తమీరలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కంటికి సంబంధించిన వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తాయి. హానికరమైన కొవ్వులను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయిలు పెరగడానికి దోహదపడతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి వాడే అనేక రసాయన మందులలో కొత్తిమీరను ఆకులను ఉపయోగిస్తారు. మొటిమలు, […]

Advertisement
Update: 2018-10-13 08:30 GMT
నాన్‌వెజ్ కూరలను గార్నిష్ చేయడం కోసమే కొత్తమీర పనికి వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. కొత్తమీరలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కంటికి సంబంధించిన వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తాయి. హానికరమైన కొవ్వులను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయిలు పెరగడానికి దోహదపడతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి వాడే అనేక రసాయన మందులలో కొత్తిమీరను ఆకులను ఉపయోగిస్తారు. మొటిమలు, పొడిచర్మం, నల్లటి మచ్చల నివారణకు కొత్తిమీరతో తయారైన ఔషధాలు ఉపకరిస్తాయి. కొత్తిమీరలోని ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల తలనొప్పి, మానసిక అలసట, టెన్షన్లు తగ్గుతాయి. ఎముకలను ధృఢపరచడానికి ఉపకరించే విటమిన్ ‘కె’ కొత్తిమీరలో పుష్కలంగా ఉంది. అంతేకాదు ఇందులో జింక్, కాపర్, పొటాషియం కూడా ఉన్నాయి. జీర్ణకోశ వ్యాధుల నివారణకు కొత్తిమీర ఉపకరిస్తుంది. కొత్తిమీర వల్ల శరీరంలో ఇన్సులిన్ తయారీ పెరుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
Tags:    
Advertisement

Similar News