నిద్రలేమితో అధికబరువు!

 అధిక బరువుకు కారణాలేమిటి..? మనకు తెలిసినవేమిటంటే అధికంగా తినడం, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం… ఇవే కాదు తగినంత నిద్ర లేకపోయినా బరువు పెరుగుతామని పరిశోధకులంటున్నారు. తగినంత ఆహారమే కాదు.. తగినంత నిద్ర కూడా అందరికీ అవసరమే. ప్రతిరోజూ రాత్రి పూట 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్ర పోయిన వాళ్లతో పోల్చితే ఆరుగంటల కన్నా తక్కువ సేపు నిద్ర పోయిన వారిలో స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలలో […]

Advertisement
Update: 2018-10-10 21:55 GMT
అధిక బరువుకు కారణాలేమిటి..? మనకు తెలిసినవేమిటంటే అధికంగా తినడం, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం… ఇవే కాదు తగినంత నిద్ర లేకపోయినా బరువు పెరుగుతామని పరిశోధకులంటున్నారు. తగినంత ఆహారమే కాదు.. తగినంత నిద్ర కూడా అందరికీ అవసరమే. ప్రతిరోజూ రాత్రి పూట 8 గంటల కన్నా ఎక్కువసేపు నిద్ర పోయిన వాళ్లతో పోల్చితే ఆరుగంటల కన్నా తక్కువ సేపు నిద్ర పోయిన వారిలో స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలలో తేలింది. పిల్లల్లో తగినంత నిద్ర లేకపోతే యుక్త వయసు, ఆ తర్వాత ఊబకాయం ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
Tags:    
Advertisement

Similar News