కేంద్ర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

దేశవ్యాప్తంగా రగులుతున్న ”మీటూ” ఉద్యమం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. తొలుత చిత్ర పరిశ్రమలోనే లైంగిక వేధింపుల అంశాలు బయటకు రాగా ఇప్పుడు పలు రంగాల్లోనూ అది వెలుగు చూస్తోంది. బాధిత మహిళలు ధైర్యంగా గతంలో తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తున్నారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి, సీనియర్ జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌ పైనా ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. అక్బర్‌పై మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేశారు. గతంలో ప్రియ రమణి అనే జర్నలిస్ట్‌ తాను లైంగిక […]

Advertisement
Update: 2018-10-09 20:41 GMT

దేశవ్యాప్తంగా రగులుతున్న ”మీటూ” ఉద్యమం అన్ని రంగాలకు విస్తరిస్తోంది. తొలుత చిత్ర పరిశ్రమలోనే లైంగిక వేధింపుల అంశాలు బయటకు రాగా ఇప్పుడు పలు రంగాల్లోనూ అది వెలుగు చూస్తోంది. బాధిత మహిళలు ధైర్యంగా గతంలో తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తున్నారు.

కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి, సీనియర్ జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌ పైనా ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి.
అక్బర్‌పై మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేశారు. గతంలో ప్రియ రమణి అనే జర్నలిస్ట్‌ తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు గతేడాది ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ అప్పుడు వేధించిన వ్యక్తి పేరు చెప్పలేదు ఆమె.

తాజాగా ”మీటూ” ఉద్యమం ఊపందుకోవడంతో ప్రియ రమణి… గతంలో తనను లైగింకంగా వేధించిన వ్యక్తి ఎంజే అక్బర్‌ అని ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించారు. కేంద్రమంత్రి పైనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

అక్బర్‌ అసభ్యకరంగా ఫోన్‌లో మాట్లాడడం, ఇబ్బందిపెట్టే తరహాలోనే పొగడ్తలు చేయడంలో తలపండిన వ్యక్తి అని ప్రియ రమణి ఆరోపించారు. తాను 23 ఏళ్ల వయసులో ఇంటర్వ్యూ కోసం వెళ్తే ఎలా వేధించింది వివరించారు. మద్యం తాగాల్సిందిగా ఒత్తిడి తేవడంతో పాటు పక్కన కూర్చోవాల్సిందిగా ఒత్తిడి చేసేవాడని గతంలో ఆమె పేరు చెప్పకుండా అక్బర్‌పై ఆరోపణలు చేశారు.

అక్బర్‌పై ప్రియ రమణి ఆరోపణలు చేయగానే మరో జర్నలిస్ట్ ప్రేరణ సింగ్‌ బింద్రా కూడా గళమెత్తారు. అక్బర్‌ నుంచి గతంలో తాను కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డానని చెప్పారు. తనతోపాటు చాలామంది మహిళా జర్నలిస్టులు అక్బర్ తో ఇబ్బందులు పడ్డారని వెల్లడించాడు.

Advertisement

Similar News