ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ లేదు!

ఈ ఏడాది నోబెల్‌ బహుమతుల ప్రకటనకు రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్‌ 1 నుంచి బహుమతులు ప్రకటించనున్నారు. ఎంపిక కమిటీ ఇప్పటికే అంతా సిద్ధం చేసిందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ను ప్రకటించబోవడం లేదట. ఆ అవార్డును 2019లో అవార్డుతో పాటు ప్రకటిస్తారట. అక్టోబర్‌ 1న ఉదయం 11.30 గంటలకు తొలి నోబెల్‌ బహుమతిని ప్రకటించనున్నారు. దీనిని నోబెల్‌ప్రైజ్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. తొలి నోబెల్‌ బహుమతిని వైద్యం లేదా ఫిజియాలజీకి కేటాయించారు. […]

Advertisement
Update: 2018-09-29 01:20 GMT

ఈ ఏడాది నోబెల్‌ బహుమతుల ప్రకటనకు రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్‌ 1 నుంచి బహుమతులు ప్రకటించనున్నారు. ఎంపిక కమిటీ ఇప్పటికే అంతా సిద్ధం చేసిందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ను ప్రకటించబోవడం లేదట. ఆ అవార్డును 2019లో అవార్డుతో పాటు ప్రకటిస్తారట.

అక్టోబర్‌ 1న ఉదయం 11.30 గంటలకు తొలి నోబెల్‌ బహుమతిని ప్రకటించనున్నారు. దీనిని నోబెల్‌ప్రైజ్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. తొలి నోబెల్‌ బహుమతిని వైద్యం లేదా ఫిజియాలజీకి కేటాయించారు. అక్టోబర్‌ 2న ఫిజిక్స్‌ నోబెల్‌ను, అక్టోబర్‌ 3న కెమిస్ట్రీ నోబెల్‌ను, అక్టోబర్‌ 5న నోబెల్‌ శాంతి బహుమతిని, అక్టోబర్‌ 8న ఎకనామిక్స్‌ నోబెల్‌ను ప్రకటించనున్నారు.

బహుమతులను వెల్లడించే మీడియా సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడమేకాక… నోబెల్‌ ఎంపిక కమిటీలతో ఇంటర్వ్యూలకు కూడా అవకాశం కల్పించనున్నారు. అంతేకాదు నోబెల్‌ బహుమతికి ఎంపికైన వారితో ఇంటర్వ్యూలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News