గిరిజన నేతల అంత్యక్రియలకు మొహం చాటేసిన బాబు, లోకేష్!

వాళ్లిద్దరూ గిరిజన నేతలు. అది కూడా తెలుగుదేశం నేతలు. వారిలో ఒకరిని చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆయన గెలిచింది వైసీపీ తరఫున అయినా చంద్రబాబు నాయుడు పోటీ పడి అతడిని తన పార్టీలోకి పిలుచుకున్నాడు. ఒకవేళ కిడారి సర్వేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరకపోయుంటే ప్రాణాలు అయినా నిలబెట్టుకునే వాడు అని కూడా అంటున్నారు. ఆయన అధికార పార్టీలోకి చేరడానికి భారీ మొత్తాన్ని తీసుకొన్నాడనే ఆరోపణలు కూడా మావోలు ఆయనను హత్య చేయడానికి ఒక రీజన్ […]

Advertisement
Update: 2018-09-24 09:42 GMT

వాళ్లిద్దరూ గిరిజన నేతలు. అది కూడా తెలుగుదేశం నేతలు. వారిలో ఒకరిని చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆయన గెలిచింది వైసీపీ తరఫున అయినా చంద్రబాబు నాయుడు పోటీ పడి అతడిని తన పార్టీలోకి పిలుచుకున్నాడు.

ఒకవేళ కిడారి సర్వేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరకపోయుంటే ప్రాణాలు అయినా నిలబెట్టుకునే వాడు అని కూడా అంటున్నారు. ఆయన అధికార పార్టీలోకి చేరడానికి భారీ మొత్తాన్ని తీసుకొన్నాడనే ఆరోపణలు కూడా మావోలు ఆయనను హత్య చేయడానికి ఒక రీజన్ అని విశ్లేషకులు అంటున్నారు.

డబ్బు తీసుకుని పార్టీ మారాడు…. అధికార పార్టీ అండతో భారీ ఎత్తున క్వారీలను నడుపుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే మావోలు కిడారిని హత్య చేశారనే మాట వినిపిస్తూ ఉంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు కిడారిని తన పార్టీలోకి చేర్చుకుని పరోక్షంగా ఆయన మరణానికి కూడా కారణమయ్యాడు.

మరి ఇంత జరుగుతుంటే…. కిడారి అంత్య క్రియలకు తెలుగుదేశం ముఖ్యులు మొహం చాటేయడం విశేషం. కిడారి హత్య తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక పార్టీలో నంబర్ టూ గా ప్రచారం పొందుతున్న లోకేష్ అయినా అంత్యక్రియలకు హాజరయ్యాడా? అంటే అదీ లేదు.

ప్రభుత్వ విప్ మావోల చేతుల్లో హత్యకు గురి అయితే చంద్రబాబు నాయుడు తక్షణం తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని రావాల్సింది. కనీసం లోకేష్ ను అయినా పంపాల్సింది. రెండూ జరగలేదు. పచ్చ కండువా వేసి కిడారి మరణానికి పరోక్షంగా కారణం అయిన చంద్రబాబు నాయుడు.. ఆయన అంత్యక్రియలను కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Similar News