యుద్ధ విమానాల్లో ఎమ్మెల్యేల తరలింపు...

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి భారీ గండం పొంచి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మంత్రి రమేష్ జార్కిహోళి, ఆయన సోదరుడు సతీష్ ఆధ్వర్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న జార్కి హోళి సోదరులు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. ఈ ఎమ్మెల్యేల బృందాన్ని ముంబై తరలించి వారి బాగోగులు చూసుకునే బాధ్యతను మహారాష్ట్ర సీఎం ఫడ్న‌వీస్‌, ఆయన కేబినెట్ మంత్రి చంద్రకాంత్ చూసుకుంటున్నారు. ముంబైలో వీరికి బీజేపీ పెద్దలతో […]

Advertisement
Update: 2018-09-20 23:18 GMT

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి భారీ గండం పొంచి ఉంది. కాంగ్రెస్‌కు చెందిన 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మంత్రి రమేష్ జార్కిహోళి, ఆయన సోదరుడు సతీష్ ఆధ్వర్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబై వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న జార్కి హోళి సోదరులు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. ఈ ఎమ్మెల్యేల బృందాన్ని ముంబై తరలించి వారి బాగోగులు చూసుకునే బాధ్యతను మహారాష్ట్ర సీఎం ఫడ్న‌వీస్‌, ఆయన కేబినెట్ మంత్రి చంద్రకాంత్ చూసుకుంటున్నారు. ముంబైలో వీరికి బీజేపీ పెద్దలతో చర్చలు సఫలం కాగానే తిరుగుబాటును ప్రకటించనున్నారు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.

అయితే ఈ విషయాన్ని కుమారస్వామి కూడా ధృవీకరించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కుట్ర చేస్తున్న బీజేపీపై తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలను తరలించేందుకు బీజేపీ పెద్దలు మిలటరీ విమానాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అయితే జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు మాజీ సీఎం యడ్యూరప్ప నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు.

Tags:    
Advertisement

Similar News