కుబ్జ

పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా మారిపోతే యెంత బాగుంటుంది? మరగుజ్జుగా ఉన్న మనిషి మహా మనిషిగా మారిపోతే యెలా ఉంటుంది? భలే ఉంటుంది కదా? అయితే కుబ్జ కథ తెలుసుకోవాల్సిందే!             కుబ్జము అంటే మరగుజ్జు అని అర్థం. కుబ్జ మరగుజ్జు మనిషే. పేరూ అదే. మరొకపేరు కూడా ఉంది. “త్రివక్ర” అని! అంటే మనిషి మూడు వంకరలు తిరిగి పొట్టిగా ఉండేదన్నమాట. రూపానికి త్రివక్రేగాని మనసు మంచిది. కుబ్జ కంసుని దాసిగా ఉండేది. సుగంధ లేపనాలు తయారు […]

Advertisement
Update: 2018-09-15 13:02 GMT

పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా మారిపోతే యెంత బాగుంటుంది? మరగుజ్జుగా ఉన్న మనిషి మహా మనిషిగా మారిపోతే యెలా ఉంటుంది? భలే ఉంటుంది కదా? అయితే కుబ్జ కథ తెలుసుకోవాల్సిందే!

కుబ్జము అంటే మరగుజ్జు అని అర్థం. కుబ్జ మరగుజ్జు మనిషే. పేరూ అదే. మరొకపేరు కూడా ఉంది. “త్రివక్ర” అని! అంటే మనిషి మూడు వంకరలు తిరిగి పొట్టిగా ఉండేదన్నమాట. రూపానికి త్రివక్రేగాని మనసు మంచిది. కుబ్జ కంసుని దాసిగా ఉండేది. సుగంధ లేపనాలు తయారు చేసేది. అంటే చందనం, కస్తూరి, పునుగు, జువ్వాజి, అగరు లాంటి అనేక సుగంధాలతో గంధాలు తీసేది. తీసి ఆ లేపనాల్ని రాజుగారికి ఇచ్చేది. లేపనాలు తీస్తుంటే వచ్చిన సుగంధ పరిమళాలు వీధి వీధంతా విరజిమ్మేవి. ఆ అద్భుతమైన వాసనలను అంతా ఆస్వాధించేవారు. కుబ్జ గురించి తలచుకొనేవారు.

ఒకసారి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. అన్న బలరామునితో కృష్ణుడు ఆ యాగం చూడాలని వచ్చాడు. కృష్ణుని స్నేహితులైన గొల్లపిల్లలంతా వచ్చారు. అంతా కలిసి తిరుగుతూ మధుర పట్టణాన్ని చూస్తున్నారు. అయితే జనం కృష్ణున్ని చూస్తున్నారు. అంద చందాలకు అబ్బుర పడుతున్నారు. అప్పుడే చాకల్లు బట్టలుతికి తెస్తున్నారు. మేము కంసుడి మేనల్లుళ్ళమని చెప్పారు బలరామకృష్ణులు. బట్టలివ్వమన్నారు. రాజుగారి బట్టలు ఇవ్వాలా? గొల్లవాళ్ళకెంత పొగరు అని అన్నాడొకడు. వాడినెత్తిమీద ఒకటి చరిస్తే నేలకంటుకుపోయాడు. దాంతో మిగతా వాళ్ళు బట్టలొదిలి పారిపోయారు. క్రిష్ణుడు సహా పిల్లలంతా ఆ బట్టలన్నీ ధరించారు. చూడముచ్చటగా ఉన్నారని రత్నాల వర్తకులు రత్నాలు తెచ్చి ఇచ్చారు. పూల అంగళ్ళవాళ్ళు పూలదండలు తెచ్చియిచ్చారు.

కాని కృష్ణుని ముక్కు ఏ సువాసనలకో వెదికిందట. అప్పుడే అక్కడికి కుబ్జ లేపనాలు తీసుకు వచ్చిందట. చూడ ముచ్చటగా ఉన్నారని కృష్ణునికి లేపనం పూసిందట. మరి కొంత ఇచ్చిందట. కృష్ణుడు ఆపరిమళాలకు ముగ్దుడయి పోయాడట. ఆ వాసనని గుండెలనిండా పీల్చుతూ… పరిమళం మనసుదోచింది అని అన్నాడట. “నన్ను ఆటపట్టిస్తున్నావా కృష్ణా” అని అన్నదట కుబ్జ. “నువ్వు అందాల చందమామవు, నీ అందం నాకెక్కణ్నుంచి వస్తుంది?” అని అన్నదట కుబ్జ. కుష్ణుని గుండె ద్రవించిందట. అప్పుడు ఏం చేసాడు? కుబ్జపాదల మీద తన కాళ్ళని అదిమిపెట్టి – మెడ మీద చెయ్యి పెట్టి పైకి లాగాడట. అంతే మూడు వంకరలు తిన్నగా అయిపోయి కుబ్జపొడవుగా అందంగా చూడముచ్చటగా తయారయిందట!

చూసినవాళ్ళు చూపు తిప్పుకోనంతగా ఆశ్చర్యపోయారట. కుబ్జ తన రూపాన్ని చూసి ఆనందపడిందట. అందం రెట్టింపయిందట. నా ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని కోరిందట. కంసుని వధించినాక కృష్ణుడు కుబ్జ ఇంటికి వెళ్ళాడట. ఆతిధ్యం స్వీకరించాడట. అలా కుబ్జ కోరిక తీరిందట!

అది కుబ్జ కథ!

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News