మిగిలిన ఎమ్మెల్యేలు ఉంటారో లేదో…

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ నేత జగన్ మోహన్‌ రెడ్డి తనపై, చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. జగన్‌ పేరు ఎత్తకుండానే వైసీపీపై విమర్శలు చేశారు. చంద్రబాబు దిగిపోతే సీటు ఎక్కాలని కొందరు ఉబలాటపడుతున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. కానీ రాజకీయాల్లో సహనం ఉండాలన్నారు. ఇప్పటికిప్పుడు ఎవరో దిగిపోతే తాను ఎక్కేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఓపిక ఉంటే 2019 వరకు ఎదురుచూడాలన్నారు. ఇప్పటికే ఆ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని.. మిగిలిన వాళ్లు […]

Advertisement
Update: 2016-09-27 05:10 GMT

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ నేత జగన్ మోహన్‌ రెడ్డి తనపై, చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. జగన్‌ పేరు ఎత్తకుండానే వైసీపీపై విమర్శలు చేశారు. చంద్రబాబు దిగిపోతే సీటు ఎక్కాలని కొందరు ఉబలాటపడుతున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. కానీ రాజకీయాల్లో సహనం ఉండాలన్నారు. ఇప్పటికిప్పుడు ఎవరో దిగిపోతే తాను ఎక్కేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఓపిక ఉంటే 2019 వరకు ఎదురుచూడాలన్నారు. ఇప్పటికే ఆ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని.. మిగిలిన వాళ్లు ఉంటారో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో తాను హోదా విషయంలో మాట్లాడిన మాటలను ఏలూరు సభలో జగన్‌ ఎందుకు చూపించారో అర్థం కావడం లేదన్నారు. ఏపీకి న్యాయం జరగాలనే రాజ్యసభలో విభజన సమయంలో పోరాడానని వెంకయ్య చెప్పారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని ఆయన చెప్పారు. లోక్‌సభ తలుపులు వేసి 23 నిమిషాల్లోనే బిల్లు ఆమోదించారని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు 28 హామీలు అడిగానని వెంకయ్య చెప్పారు. అడిగినవన్నీ ఇస్తామన్నారు కానీ బిల్లులోమాత్రం పెట్టలేదని వెంకయ్య చెప్పారు. పార్లమెంట్‌లో తాను పోరాడినప్పుడు తన ముందు ఇతర పార్టీల ఎంపీలు నానా గందరగోళం సృష్టించారని… ఆ విజువల్స్ మీడియాలో చూపించలేదని వెంకయ్య ఆవేదన చెందారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News