పవన్‌ కల్యాణ్‌పై జగన్‌ స్పందన

ప్రవాసాంధ్రులతో జరిగిన లైవ్‌ షోలో పాల్గొన్న జగన్‌ కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఎవరిని మేనేజ్ చేసినా అన్యాయానికి గురైన జనాన్ని మాత్రం మేనేజ్ చేయలేరని జగన్ అన్నారు. ”రాష్ట్ర విభజన రోజు ప్రత్యేక హోదాతో అన్ని వస్తాయని చెప్పింది వారే. విభజన సమయంలో కాంగ్రెస్‌ ఎంపీల పరిస్థితినే ఇప్పుడు బీజేపీ, టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. దాని ఫలితం అనుభవిస్తారు. పవన్‌ కల్యాణ్‌ను లైన్‌లో పెట్టుకున్నా మరొకరిని లైన్‌లో పెట్టుకున్నా ఐదున్నర కోట్ల మందిని లైన్‌లో పెట్టుకోవడం వారికి […]

Advertisement
Update: 2016-09-25 10:43 GMT

ప్రవాసాంధ్రులతో జరిగిన లైవ్‌ షోలో పాల్గొన్న జగన్‌ కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఎవరిని మేనేజ్ చేసినా అన్యాయానికి గురైన జనాన్ని మాత్రం మేనేజ్ చేయలేరని జగన్ అన్నారు. ”రాష్ట్ర విభజన రోజు ప్రత్యేక హోదాతో అన్ని వస్తాయని చెప్పింది వారే. విభజన సమయంలో కాంగ్రెస్‌ ఎంపీల పరిస్థితినే ఇప్పుడు బీజేపీ, టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. దాని ఫలితం అనుభవిస్తారు. పవన్‌ కల్యాణ్‌ను లైన్‌లో పెట్టుకున్నా మరొకరిని లైన్‌లో పెట్టుకున్నా ఐదున్నర కోట్ల మందిని లైన్‌లో పెట్టుకోవడం వారికి సాధ్యం కాదు. తప్పు చేసిన తర్వాత ప్రజలను లైన్‌లో పెట్టుకోలేరు. ఎందుకంటే వీరి వల్ల అన్యాయానికి గురవుతున్న వారే ప్రజలు.

రాష్ట్ర విభజన సమయంలోనూ హోదా ఇస్తామంటే ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు హోదా ఇస్తే పక్క రాష్ట్రాలు ఒప్పుకోవంటూ కుంటిసాకులు చెబుతున్నారు. గతంలో వాజ్‌పేయి ఒక్క కలం పోటుతో హోదా ఇచ్చిన విషయం మరిచిపోకూడదు. అరుణ్ జైట్లీ ప్రకటనలో అసలు ప్యాకేజ్ అన్నదే లేదు. జమ్ముకాశ్మీర్‌కు 80వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. అంతమాత్రాన దానికి హోదా తీసేశారా?. లేదు కదా?. అక్కడిలాగే ఏపీకి ప్యాకేజ్‌తో పాటు హోదా కూడా ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో హంగు ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా ఏపీ ఇచ్చే ఆక్సిజన్ తోనే కేంద్రం బతికే పరిస్థితి వస్తుంది. ఎవరైతే హోదా ఇస్తారో వారికే మద్దతు ఇస్తాం” అని జగన్‌ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News