శ‌వానికి తాడు క‌ట్టి లాగేశారు!

దేశంలో మాన‌వ‌త్వం క‌రువ‌వుతోంది. బ‌తికి ఉన్న మ‌నిషిపై ఎలాంటి ద‌య చూప‌రు స‌రే.. క‌నీసం చ‌నిపోయిన వారిప‌ట్ల క‌నీసం మ‌ర్యాద పాటించాలి క‌దా! ఎంత అనాథ శ‌వం అయితే మాత్రం మెడ‌కు తాడుక‌ట్టి కుక్క‌ను లాగిన‌ట్లు లాగుతారా? మ‌నిషికి సాటి మ‌నిషి ఇచ్చే మ‌ర్యాద ఇదేనా? ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న బిహార్‌లో చోటు చేసుకుంది. బిహార్ లోని వైశాలిలో గంగాన‌దిలో ఓ మృత‌దేహం తేలుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ శ‌వం […]

Advertisement
Update: 2016-09-15 21:00 GMT
దేశంలో మాన‌వ‌త్వం క‌రువ‌వుతోంది. బ‌తికి ఉన్న మ‌నిషిపై ఎలాంటి ద‌య చూప‌రు స‌రే.. క‌నీసం చ‌నిపోయిన వారిప‌ట్ల క‌నీసం మ‌ర్యాద పాటించాలి క‌దా! ఎంత అనాథ శ‌వం అయితే మాత్రం మెడ‌కు తాడుక‌ట్టి కుక్క‌ను లాగిన‌ట్లు లాగుతారా? మ‌నిషికి సాటి మ‌నిషి ఇచ్చే మ‌ర్యాద ఇదేనా? ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న బిహార్‌లో చోటు చేసుకుంది. బిహార్ లోని వైశాలిలో గంగాన‌దిలో ఓ మృత‌దేహం తేలుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ శ‌వం మెడ‌కు తాడుక‌ట్టి త‌మ వాహ‌నం వ‌ద్దకు లాక్కుంటూ వెళ్లారు. ఈ దృశ్యాన్ని కొంద‌రు త‌మ సెల్‌ఫోన్ల‌లో బంధించారు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే స్పందించిన బిహార్ పోలీసు ఉన్న‌తాధికారులు ఆ పోలీసుల‌నిద్ద‌రినీ స‌స్పెండ్ చేశామ‌ని ప్ర‌క‌టించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News