తన, మన గుర్తించేందుకే ఈ ప్రశ్నలా బాబు?

2011 గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలను బుధవారం ఏపీపీఎస్సీ ప్రశాంతంగా నిర్వహించింది. మొత్తం 3,128మంది పరీక్షలు రాశారు. కానీ ప్రశ్నాపత్రంలో రెండు గమ్మత్తయిన ప్రశ్నలు ఇచ్చారు. అందులో ఒకటి ప్రత్యేకహోదా గురించి. “కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. కానీ హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోలిస్తే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?.” వివరిస్తూ వ్యాసం రాయాల్సిందిగా పరీక్షలో కోరారు. ఈ ప్రశ్న వల్ల ఉత్పన్నమయ్యే సమస్య ఏమిటంటే?.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే స్యయంగా హోదాకన్నా ప్యాకేజే బెటర్‌ అని […]

Advertisement
Update: 2016-09-14 23:35 GMT

2011 గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలను బుధవారం ఏపీపీఎస్సీ ప్రశాంతంగా నిర్వహించింది. మొత్తం 3,128మంది పరీక్షలు రాశారు. కానీ ప్రశ్నాపత్రంలో రెండు గమ్మత్తయిన ప్రశ్నలు ఇచ్చారు. అందులో ఒకటి ప్రత్యేకహోదా గురించి. “కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. కానీ హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోలిస్తే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?.” వివరిస్తూ వ్యాసం రాయాల్సిందిగా పరీక్షలో కోరారు. ఈ ప్రశ్న వల్ల ఉత్పన్నమయ్యే సమస్య ఏమిటంటే?.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే స్యయంగా హోదాకన్నా ప్యాకేజే బెటర్‌ అని చెప్పారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇకేంముంది?. ప్యాకేజ్‌కు మించింది ఏదో చెప్పండి కేంద్రంపై పోరాడుతా అని అన్నారు.

అదే సమయంలో వైసీపీతో పాటు ఇతర పార్టీలు హోదాయే కావాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయి. పార్టీల మధ్య అభిప్రాయభేదాలున్నట్టుగానే పరీక్షలు రాసిన వారికీ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యాకేజ్ కంటే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయని జవాబు పత్రంలో గట్టిగా వాదిస్తూ రాసిన వారికి ఎక్కువ మార్కులు వేస్తారా?… లేక చంద్రబాబు, ఆయన అనుకూల వాదులు, అనుకూల మీడియా చెబుతున్నట్టు ప్యాకేజే బెటర్ అన్నట్టుగా జవాబు రాసిన వారికి ఎక్కువ మార్కులు వేస్తారా అన్నది స్పష్టం కావాలి.

ఇలాంటిదే మరో ప్రశ్నను ఏపీపీఎస్సీ సంధించింది. “పట్టిసీమ వల్ల ప్రయోజనాలు వివరించండి?” అని ప్రశ్న అడిగారు. ఇక్కడ కూడా పట్టిసీమ వల్ల రాయలసీమ రతనాల సీమ అవుతుందని, ఏపీలో కరువే ఉండదని బాబు అండ్ కంపెనీ చెబుతోంది. అదే సమయంలో రాయలసీమవాదులు, వైసీపీ, కాంగ్రెస్‌లు పట్టిసీమ అంతా ఒక బోగస్ అని అంటున్నాయి. పట్టిసీమ పూర్తయినా ఇప్పటికీ రాయలసీమకు చుక్క నీరును కూడా అదనంగా శ్రీశైలం నుంచి అందించకపోవడాన్ని వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టిసీమను సమర్ధించేవారంతా టీడీపీ వాళ్లు… వ్యతిరేకించేవాళ్లంతా వైసీపీ వాళ్లు అన్నట్టుగా తయారైంది. మరీ 2011 గ్రూప్ -1 పరీక్షకు హాజరైన వారు పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని విశ్లేషిస్తే ఎక్కువ మార్కులు వేస్తారా?.. లేక చంద్రబాబే కరెక్ట్ అన్నట్టుగా సమాధానం రాసిన వారికి ఎక్కువ మార్కులు వేస్తారా?. చూడాలి…. సమర్థించడం, వ్యతిరేకించడం ఆధారంగా మార్కులు వేస్తారా?. లేక అభ్యర్థులు విశ్లేషణ శక్తి ఆధారంగా మార్కులు వేస్తారో?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News