కొడుకులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న తండ్రి

వరంగల్‌ జిల్లా కాశిబుగ్గకు చెందిన ఒక వ్యక్తి తన అంత ఎదిగిన కొడుకులను, భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఒక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తనకున్న కొద్దిపాటి ఆస్తిని ఆవిడ పేరుమీద రాశాడు. ఇక అప్పటినుంచి భార్యా పిల్లలను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తనను పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టుకు వెళ్లి వాళ్ల దగ్గరనుంచి కొంత డబ్బు పొందాడు. మళ్లీ గతవారంలో తనే చేసుకున్న గాయాలతో నేరుగా కోర్టుకు వెళ్లి కొడుకులు తనను కొట్టారని, పట్టించుకోవడం లేదని, […]

Advertisement
Update: 2016-09-13 23:04 GMT

వరంగల్‌ జిల్లా కాశిబుగ్గకు చెందిన ఒక వ్యక్తి తన అంత ఎదిగిన కొడుకులను, భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఒక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తనకున్న కొద్దిపాటి ఆస్తిని ఆవిడ పేరుమీద రాశాడు. ఇక అప్పటినుంచి భార్యా పిల్లలను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తనను పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టుకు వెళ్లి వాళ్ల దగ్గరనుంచి కొంత డబ్బు పొందాడు.

మళ్లీ గతవారంలో తనే చేసుకున్న గాయాలతో నేరుగా కోర్టుకు వెళ్లి కొడుకులు తనను కొట్టారని, పట్టించుకోవడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు రిజిష్టర్‌ చేయడం లేదని న్యాయమూర్తి ముందు వాపోయాడు. ఆయన దీనగాథకు స్పందించిన న్యాయమూర్తి కేసు రిజిష్టర్‌ చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు.

రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద మనుషులను విచారించగా కొడుకులు ఆయనను వేధించడంలేదని, ఆయనే డబ్బుల కోసం కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చెప్పారు. పిల్లలు సంపాదించిన ఆస్తి కూడా తీసుకుని ఉంచుకున్న ఆవిడకు ఇవ్వాలని ఆయన ప్లాన్‌ అని వాళ్లకు అర్ధమైంది.

మొత్తంమీద పెద్ద మనుషులు, కొడుకులు ఒక ఒప్పందానికి వచ్చి తండ్రికి రూ. 10 లక్షలు ఇచ్చి ఈ సమస్యను సెటిల్‌ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News