స్వామి వారి నగలు అధికారి లాకర్‌లో...

శ్రీశైలం దేవస్థానం అధికారి కంచర్ల విజయసాగర్‌ బాబు అక్రమ ఆస్తులు 70 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయనే వార్త భక్తులలో సంచలనం రేపింది. తాజాగా ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన విషయాలు వింటుంటే భక్తులకు దిమ్మతిరిగిపోతోంది. శ్రీశైలం దేవస్థానంలో కొలువైన మల్లేశ్వరస్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించిన నగలు మాయమై ఇపుడు కంచర్ల విజయసాగర్‌ బాబు, ఆయన బినామీ మన్నే శ్రీనివాసరావుల లాకర్లలో లభించాయి. అప్పుడప్పుడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ దేవాలయాన్ని సందర్శించి భక్తుల కానుకలు ఉన్నాయా […]

Advertisement
Update: 2016-09-08 03:39 GMT

శ్రీశైలం దేవస్థానం అధికారి కంచర్ల విజయసాగర్‌ బాబు అక్రమ ఆస్తులు 70 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయనే వార్త భక్తులలో సంచలనం రేపింది. తాజాగా ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన విషయాలు వింటుంటే భక్తులకు దిమ్మతిరిగిపోతోంది.

శ్రీశైలం దేవస్థానంలో కొలువైన మల్లేశ్వరస్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించిన నగలు మాయమై ఇపుడు కంచర్ల విజయసాగర్‌ బాబు, ఆయన బినామీ మన్నే శ్రీనివాసరావుల లాకర్లలో లభించాయి.

అప్పుడప్పుడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ దేవాలయాన్ని సందర్శించి భక్తుల కానుకలు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తుంటారు. అలా వచ్చిన పై అధికారులను వాళ్లు మెచ్చే “అతిధి మర్యాదలతో” వీళ్లు సంతృప్తి పరచడం వల్ల ఇప్పటిదాకా భక్తులు సమర్పించిన కానుకలు మిస్‌ అయిన సంగతి బయటకు రాలేదు. ఇప్పుడు వీళ్ల లాకర్‌లలో ఈ నగలు దొరికాక దేవుడి నగలు మాయమైన సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. కాబట్టి దేవాదాయ శాఖ ఈ పై అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News