చైనా దృష్టిలో భారతీయులు క్రిమినల్సా..?

ఎయిర్‌ చైనా ప్రచురించి, తమ ప్రయాణికులకు అందించే “వింగ్స్‌ ఆఫ్‌ చైనా” మ్యాగజైన్‌ లండన్‌ నగరం మీద, అక్కడి టూరిస్ట్‌ ప్రదేశాలమీద ప్రత్యేక వ్యాసాలతో ప్రచురించిన సంచికలో భారతీయులమీద అవమానకర వ్యాఖ్యలు చేసింది. లండన్‌ మహానగరం యాత్రికులకు సురక్షిత ప్రదేశం. అయినప్పటికి భారతీయులు, పాకిస్తానీయులు, నల్లజాతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోకి ప్రవేశించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాత్రివేళల్లో ఒంటరిగా సంచరించకండి. ముఖ్యంగా స్త్రీలు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించకండి అని లండన్‌ యాత్రికులకు ఈ […]

Advertisement
Update: 2016-09-08 04:16 GMT

ఎయిర్‌ చైనా ప్రచురించి, తమ ప్రయాణికులకు అందించే “వింగ్స్‌ ఆఫ్‌ చైనా” మ్యాగజైన్‌ లండన్‌ నగరం మీద, అక్కడి టూరిస్ట్‌ ప్రదేశాలమీద ప్రత్యేక వ్యాసాలతో ప్రచురించిన సంచికలో భారతీయులమీద అవమానకర వ్యాఖ్యలు చేసింది.

లండన్‌ మహానగరం యాత్రికులకు సురక్షిత ప్రదేశం. అయినప్పటికి భారతీయులు, పాకిస్తానీయులు, నల్లజాతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోకి ప్రవేశించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాత్రివేళల్లో ఒంటరిగా సంచరించకండి. ముఖ్యంగా స్త్రీలు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించకండి అని లండన్‌ యాత్రికులకు ఈ “వింగ్స్‌ ఆఫ్‌ చైనా” మ్యాగజైన్‌ ఉచిత సలహా పడేసింది.

ఇంగ్లండ్‌ లేబర్‌ పార్టీ ఎంపీ ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి మ్యాగజైన్‌ని సర్క్యులేషన్‌ నుంచి తొలగించి, ఎయిర్‌ చైనా క్షమాపణ చెప్పాలని కోరారు. ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బ్రిటన్‌లోని చైనా అంబాసిడర్‌ను కోరారు.

గతంలో కొన్ని చైనా కంపెనీలు ఇలాంటి జాతి వివక్ష ప్రకటనలను విడుదల చేశాయి.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News