విశాఖలో మొదలైన నిరసనలు

విశాఖకు దక్కాల్సిన రైల్వే జోన్‌ను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో చంద్రబాబు చెప్పడం, అదే విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో ఉత్తరాంధ్రలో అలజడి మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. జోన్‌ను విజయవాడకు మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా […]

Advertisement
Update: 2016-09-07 01:34 GMT

విశాఖకు దక్కాల్సిన రైల్వే జోన్‌ను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో చంద్రబాబు చెప్పడం, అదే విషయాన్ని టీడీపీ అనుకూల పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో ఉత్తరాంధ్రలో అలజడి మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. జోన్‌ను విజయవాడకు మారిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

దశాబ్దాలుగా ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతున్నారని, రైల్వే జోన్‌ను విజయవాడకు తరలించాలనుకోడం పరాకాష్ట అని మండిపడ్డారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలను స్తంభింప చేస్తామన్నారు. చంద్రబాబు, మోదీ కలిసి కుట్ర చేసి ఉత్తరాంధ్రకు ఉత్తచేయి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని రైల్వే జోన్‌ సాధన సమితి నేతలు ఆరోపించారు. ఆందోళన కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ కూడా పాల్గొన్నారు. మరోవైపు రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమని ఎంపీ సుబ్బరామిరెడ్డి చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ కేంద్రంగానే జోన్ ఏర్పాటుచేయాలన్నారు. ఏపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్‌ ప్రభుపై చంద్రబాబు ఒత్తిడి తేవాలని సుబ్బరామిరెడ్డి డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News