క్యాన్సర్‌ రాబోతుందని తెలియజెప్పే రక్త పరీక్ష

క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ప్రారంభ దశలో గుర్తిస్తే చాలావరకు నయమవుతుంది. ముదిరిపోయాక తెలుసుకున్నా బ్రతుకుతామన్న ఆశ ఉండదు. ఇప్పటివరకు మనకున్న వైద్య పరిజ్ఞానంతో ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించగలగుతున్నాం. ఇటీవల స్వాన్సీలో జరిగిన బ్రిటీష్‌ సైన్స్‌ ఫెస్టివల్‌లో ప్రొఫెసర్‌ గారెత్‌ జన్‌కిన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఒక రక్త పరీక్ష వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షను స్మోక్‌ డిటెక్టర్‌లాంటిదని అభివర్ణించారు. ఒక భవనంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం మొదలైతే వెంటనే స్మోక్‌ డిటెక్టర్‌ ద్వారా తెలిసిపోతుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ తాలూకు […]

Advertisement
Update: 2016-09-07 01:01 GMT

క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ప్రారంభ దశలో గుర్తిస్తే చాలావరకు నయమవుతుంది. ముదిరిపోయాక తెలుసుకున్నా బ్రతుకుతామన్న ఆశ ఉండదు. ఇప్పటివరకు మనకున్న వైద్య పరిజ్ఞానంతో ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించగలగుతున్నాం.

ఇటీవల స్వాన్సీలో జరిగిన బ్రిటీష్‌ సైన్స్‌ ఫెస్టివల్‌లో ప్రొఫెసర్‌ గారెత్‌ జన్‌కిన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఒక రక్త పరీక్ష వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షను స్మోక్‌ డిటెక్టర్‌లాంటిదని అభివర్ణించారు. ఒక భవనంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం మొదలైతే వెంటనే స్మోక్‌ డిటెక్టర్‌ ద్వారా తెలిసిపోతుంది. అలాగే శరీరంలో క్యాన్సర్‌ తాలూకు ఏ లక్షణాలు బయటపడకముందే ఈ పరీక్ష ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. రక్తంలోని ఎర్రరక్త కణాలలో ఉండే మాంసకృతులు అసాధారణంగా రెట్టింపుకావడాన్ని ( మ్యుటేషన్‌ ) ఈ రక్త పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇలా మ్యుటేషన్‌ కావడం అంటే త్వరలో ఆ వ్యక్తికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ రక్త పరీక్ష చేయడానికి సుమారు రూ. 3000 అవుతుంది.

ఇప్పటివరకు క్యాన్సర్‌ వచ్చాక కనుక్కొనే పరీక్షలే తప్ప, క్యాన్సర్‌ రాబోతుందని తెలియజేసే పరీక్షలు లేవు. ఇప్పుడు ఈ సింపుల్‌ పరీక్ష వల్ల భవిష్యత్తులో క్యాన్సర్‌ వస్తుందని తెలుసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వ్యక్తులకు ఈ పరీక్ష వరం లాంటిది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News