అమెరికాకు గుణపాఠం నేర్పిన చైనా

అమెరికా నుంచి ఏ నాయకుడు వచ్చినా మన దేశంలో వాళ్లకు జరిగే అతిధి మర్యాదలు చెప్పనలవికాదు. ఇక అమెరికా అధ్యక్షుడు వస్తే మనదేశం ఆయనకు పాదాక్రాంతం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ముందుగా అమెరికా నుంచి దిగే అధికారులు మన అధికారులకు యజమానుల్లా ఆదేశాలు ఇస్తారు. వాళ్ల నాయకులు ఉన్నంతవరకు ఆ ప్రాంతంలో వాళ్లదే పెత్తనం. మన నాయకుల సెక్యూరిటీని కూడా దగ్గరకు రానివ్వరు. మన నాయకులు అమెరికా అధికారుల ముందు చేతులు నలుపుకుంటూ వాళ్ల ఆదేశాలు పాటిస్తారు. అదే […]

Advertisement
Update: 2016-09-06 00:22 GMT

అమెరికా నుంచి ఏ నాయకుడు వచ్చినా మన దేశంలో వాళ్లకు జరిగే అతిధి మర్యాదలు చెప్పనలవికాదు. ఇక అమెరికా అధ్యక్షుడు వస్తే మనదేశం ఆయనకు పాదాక్రాంతం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ముందుగా అమెరికా నుంచి దిగే అధికారులు మన అధికారులకు యజమానుల్లా ఆదేశాలు ఇస్తారు. వాళ్ల నాయకులు ఉన్నంతవరకు ఆ ప్రాంతంలో వాళ్లదే పెత్తనం. మన నాయకుల సెక్యూరిటీని కూడా దగ్గరకు రానివ్వరు. మన నాయకులు అమెరికా అధికారుల ముందు చేతులు నలుపుకుంటూ వాళ్ల ఆదేశాలు పాటిస్తారు.

అదే మన నాయకులు అమెరికా వెళితే ఎవరూ పట్టించుకోరు. సాక్షాత్తు మన రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ను అమెరికా అధికారులు ఎంతగా అవమానించారో మనందరికీ తెలుసు. అమెరికా నుంచి ఎవరు వచ్చినా చొక్కాలు చించుకునే చంద్రబాబును కూడా బూట్లు విప్పించి నడిపించింది అమెరికా అధికారులే. ఇక షారూఖ్‌ ఖాన్‌లు, జార్జీ ఫెర్నాండెజ్‌లు… చెప్పుకుంటూ పోతే ఇది చాంతాడంత లిస్టు. అంతదాకా ఎందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోడీకే వీసా ఇవ్వలేదు. సెక్యూరిటీ పేరుతో అమెరికా చేసే అరాచకం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఆదివారంనాడు చైనా వచ్చిన అమెరికా అధ్యక్షుడికి అలాంటి అనుభవమే ఎదురైంది.

విదేశీనాయకులకు అమెరికా ఎలాంటి మర్యాద ఇస్తుందో అలాంటి మర్యాదనే అమెరికా అధ్యక్షుడికి చైనా ఇచ్చింది. అమెరికా అధికారులను ఆ దరిదాపులకు రానివ్వకుండా దూరంగా పెట్టింది. ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన అమెరికా అధికారులను అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. ఒబామాతో వచ్చిన జర్నలిస్టులను, సిబ్బందిని కూడా ఆయనకు దూరంగా ఉంచారు. దానికి మండిపడ్డ అమెరికా అధికారి మా నాయకుడికోసం మేం నిబంధనలు రూపొందిస్తాం. ఎవరు ఎక్కడ ఉండాలో మేము నిర్ణయిస్తాం అన్నాడు. అందుకు స్పందించిన చైనా అధికారి ఇది మా దేశం. ఇక్కడ మా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే అని గట్టిగా సమాధానం చెప్పాడు.

ఈ పరిణామాలను అధ్యక్షుడు ఒబామా పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. సర్దుకుపోయాడు. కానీ అమెరికా అధికారులు అహంకారంతో ఊగిపోయారు. తమ మాటకు ప్రపంచ దేశాల్లో ఎదురే లేదనుకున్న వాళ్లకు ఇప్పుడు తెలిసి ఉంటుంది. అమెరికా అధికారుల వ్యవహారశైలికి విదేశీనాయకులు, అధికారులు ఎంత బాధపడుతుంటారో కొంతైనా అర్ధమై ఉండాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News