ఏపీలో 500 కోట్ల స్కాం- రామకృష్ణ

మెడికల్ సీట్ల భర్తీలో రూ. 500కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. విభజన చట్టం, ఆర్టికల్ 371-డి ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉన్నా… అధికారులు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కుమ్మకై ఏపక్షంగా కౌన్సిలింగ్‌ నిర్వహించాయని లేఖలో ఆయన ఆరోపించారు. 350 ఎంబీబీఎస్ సీట్లు మినహా మిగిలిన సీట్లను ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు తన ఇష్టానుసారం అమ్ముకున్నాయని రామకృష్ణ వివరించారు. ఈ వ్యవహారంలో ఏపీ […]

Advertisement
Update: 2016-09-05 23:56 GMT

మెడికల్ సీట్ల భర్తీలో రూ. 500కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. విభజన చట్టం, ఆర్టికల్ 371-డి ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉన్నా… అధికారులు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కుమ్మకై ఏపక్షంగా కౌన్సిలింగ్‌ నిర్వహించాయని లేఖలో ఆయన ఆరోపించారు. 350 ఎంబీబీఎస్ సీట్లు మినహా మిగిలిన సీట్లను ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు తన ఇష్టానుసారం అమ్ముకున్నాయని రామకృష్ణ వివరించారు. ఈ వ్యవహారంలో ఏపీ మంత్రుల భాగస్వామ్యం కూడా ఉందని చంద్రబాబుకు రాసిన లేఖలో ఆరోపించారు. దాదాపు 500కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. తిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్ల ప్రవేశాల్లో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు ఓపెన్ కేటగిరిలో సీట్లు వచ్చినా… వారికి రిజర్వుడ్‌ కేటగిరిలో సీట్లు కేటాయించారని ఎత్తిచూపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News