టీజీ వెంకటేష్‌పై బోండా ఉమా ఫైర్

పవన్‌ కల్యాణ్‌ విషయంలో టీడీపీ నేతలు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఎంపీలను పవన్ నేరుగా తిట్టిపోయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగానే టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌..పవన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “నీవెంత, నీ స్థాయి ఎంత” అని నిప్పులు చెరిగారు. రాజకీయాలంటే గడ్డం పెంచుకోవడం, దాన్ని గీయించుకోవడం కాదని అన్నారు. అన్న పార్టీని అమ్మేస్తే తమ్ముడు పార్టీ పెట్టి కుంభకర్ణుడిలా నిద్రపోయాడని విమర్శించారు. అశోక్ గజపతి రాజు గురించి మాట్లాడేంత వాడివా… నీవెంత…నీ కెపాసిటీ ఎంత […]

Advertisement
Update: 2016-08-29 23:21 GMT

పవన్‌ కల్యాణ్‌ విషయంలో టీడీపీ నేతలు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఎంపీలను పవన్ నేరుగా తిట్టిపోయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగానే టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌..పవన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “నీవెంత, నీ స్థాయి ఎంత” అని నిప్పులు చెరిగారు. రాజకీయాలంటే గడ్డం పెంచుకోవడం, దాన్ని గీయించుకోవడం కాదని అన్నారు. అన్న పార్టీని అమ్మేస్తే తమ్ముడు పార్టీ పెట్టి కుంభకర్ణుడిలా నిద్రపోయాడని విమర్శించారు. అశోక్ గజపతి రాజు గురించి మాట్లాడేంత వాడివా… నీవెంత…నీ కెపాసిటీ ఎంత అని విరుచుకుపడ్డారు.

అయితే టీజీ వ్యాఖ్యలపై జనసేన వారు స్పందించలేదు కానీ… టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాత్రం విరుచుకుపడ్డారు. టీజీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ సంస్కృతిని టీడీపీలో చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ విషయంలో పార్టీ ఒక వైఖరితో ఉందని దానికి కట్టుబడి ఉండాలని టీజీకి హితవు పలికారు ఉమా. మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్‌లో లాగా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడితే ఎలా అని బోండా ఉమా ప్రశ్నించారు.

“అవును నిజమే. మా నాయకుడు కాంగ్రెస్ నుంచే వచ్చాడు. ముక్కుసూటిగా రాజకీయాలు చేయడం మాత్రమే మా నాయకుడికి తెలుసు. మీ పార్టీ చేసే లోపాయికారి రాజకీయాలు తెలియవు. అందుకే ఎంపీలను దూషించిన పవన్ కల్యాణ్ ని మా నాయకుడు తిట్టాడు. పవన్ కల్యాణ్ తో లోపాయికారి రాజకీయాలు నడిపే మీ సంస్కృతి తెలియకే తిట్టాడు. పవన్ కల్యాణ్ మీ జేబులో మనిషని, మీరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను తిరుపతి సభలో చదివాడని బోండా ఉమాగారు మీకు తెలుసు గానీ, మా నాయకుడికి తెలియదు కదా” అని టీజీ వెంకటేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News