జనసేన వైరిపక్షమేనా?.. సర్వేలో విడదీసిన టీడీపీ

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారన్న దానిపై ఇటీవల ఒక ప్రముఖ సంస్థ ద్వారా సర్వే నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు మరో సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి కేవలం 51 స్థానాలు మాత్రమే వస్తాయని తేలిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీయే నేరుగా ప్రజాభిప్రాయసేకరణ చేస్తోంది. టీడీపీ కార్యాలయం నుంచి ఏపీలోని అనేక మంది మొబైల్స్‌కు సర్వే ప్రశ్న వెళ్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మీరు ఓటేస్తారంటూ ఆప్షన్లు […]

Advertisement
Update: 2016-08-27 01:47 GMT

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారన్న దానిపై ఇటీవల ఒక ప్రముఖ సంస్థ ద్వారా సర్వే నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు మరో సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి కేవలం 51 స్థానాలు మాత్రమే వస్తాయని తేలిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీయే నేరుగా ప్రజాభిప్రాయసేకరణ చేస్తోంది. టీడీపీ కార్యాలయం నుంచి ఏపీలోని అనేక మంది మొబైల్స్‌కు సర్వే ప్రశ్న వెళ్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మీరు ఓటేస్తారంటూ ఆప్షన్లు వినిపిస్తున్నారు. ఆప్షన్ల కింద వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్‌, జనసేన, టీడీపీ-బీజేపీ కూటమి, వామపక్షాల పేర్లు చెబుతున్నారు. 040-38399999 నెంబర్ నుంచి ఈ ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. తిరిగి అదే నెంబర్‌కు ఫోన్‌ చేస్తే టీడీపీ పార్టీకి స్వాగతం అంటూ వస్తోంది. అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే…

ఆప్షన్లలో టీడీపీ- బీజేపీని కూటమి కింద చూపెట్టారు. కానీ మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేనకు మాత్రం ప్రత్యేకంగా ఆప్షన్ ఇచ్చారు. దీని బట్టి జనసేన వచ్చే ఎన్నికల్లో తమ కూటమిలో ఉండదన్న నిర్దారణకు టీడీపీ వచ్చినట్టుగా అనిపిస్తోంది. లేదంటే జనసేనకు సొంతంగా ఎంత ఆదరణ ఉందన్నది తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చన్న భావన కూడా ఉంది. అయితే ఒక వేళ పార్టీల సొంతబలాన్ని లెక్కకట్టే యోచనే ఉంటే బీజేపీకి కూడా ప్రత్యేకంగా ఆప్షన్ ఇవ్వాలి కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News