జగన్‌పై వ్యాఖ్యలకు ధర్మాన వివరణ...

మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ఒక పత్రిక కథనాన్ని ప్రచురించడం కలకలం రేపింది. కడపలో జగనే కాదు ఎవరుపోటీ చేసినా వైసీపీ తరపున గెలుస్తారని.. అదే శ్రీకాకుళం నుండి జగన్‌ పోటీ చేసినా గెలవడం అంత ఈజీ కాదంటూ ధర్మాన వ్యాఖ్యానించారంటూ సదరు పత్రిక కథనం రాసింది. ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు వేరుగా ఉంటాయని అన్నారట. గెలిచిన ఎమ్మెల్యేలను దగ్గరకుతీసుకోవడం, ఓడిపోయిన వారిని దూరంగా పెట్టడం వంటి విధానాన్ని జగన్ […]

Advertisement
Update: 2016-08-25 06:28 GMT

మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ఒక పత్రిక కథనాన్ని ప్రచురించడం కలకలం రేపింది. కడపలో జగనే కాదు ఎవరుపోటీ చేసినా వైసీపీ తరపున గెలుస్తారని.. అదే శ్రీకాకుళం నుండి జగన్‌ పోటీ చేసినా గెలవడం అంత ఈజీ కాదంటూ ధర్మాన వ్యాఖ్యానించారంటూ సదరు పత్రిక కథనం రాసింది. ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు వేరుగా ఉంటాయని అన్నారట. గెలిచిన ఎమ్మెల్యేలను దగ్గరకుతీసుకోవడం, ఓడిపోయిన వారిని దూరంగా పెట్టడం వంటి విధానాన్ని జగన్ మానుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారని కథనం.

అంతే కాదు పరోక్షంగా సాక్షి పత్రిక పనితీరుపైనా ధర్మాన అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీకి సొంత పత్రిక ఉన్నా ఉపయోగం లేదని, జనంలోకి చొచ్చుకెళ్లలేకపోతున్నామని బుధవారం ధర్మాన వ్యాఖ్యానించారంటూ ఒక పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై ధర్మాన గురువారం మీడియా ముందు స్పందించారు. సదరు పత్రిక తన మాటల సారాంశాన్నివక్రీకరించిందని మండిపడ్డారు. జగన్‌ నుంచి తనను దూరం చేసేందుకు కొన్ని పత్రికలు ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. విలువలకు కట్టుబడి బతుకుతున్న వ్యక్తిని తానని చెప్పారు. కుట్రల ద్వారా వైఎస్ కుటుంబం నుంచి తనను వేరు చేయాలనుకునే ప్రయత్నాలు ఫలించవన్నారు.

వైఎస్‌ఆర్‌ వల్లే బీసీలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి జరిగిందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ.. శ్రీకాకుళం జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత పథకాన్ని ఇవ్వలేదని ధర్మాన విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News