బాబు పుష్కర ప్రసంగాలపై అంబటి కొత్త కోణం... బాబు గుండెపైనా సెటైర్లు

కృష్ణా పుష్కరాల 12 రోజుల పాటు ప్రతి సాయంత్రం సంకల్పం పేరుతో చంద్రబాబు చేసిన సుధీర్ఘ ప్రసంగాలను వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పుపట్టారు. భక్తితో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులను చంద్రబాబు, టీడీపీ నేతలు నిర్బంధించి వేధించారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రసంగం మొదలవడానికి కాసేపు ముందే భక్తులు బయటకు వెళ్లకుండా గేట్లు మూసేశారని, రవాణా వ్యవస్థను స్తంభింప చేస్తూ వచ్చారని అంబటి చెప్పారు. అలా భక్తులు అక్కడి నుంచి వెళ్లకుండా నిర్భంధించి మరీ చంద్రబాబు ప్రసంగాలు […]

Advertisement
Update: 2016-08-24 03:46 GMT

కృష్ణా పుష్కరాల 12 రోజుల పాటు ప్రతి సాయంత్రం సంకల్పం పేరుతో చంద్రబాబు చేసిన సుధీర్ఘ ప్రసంగాలను వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పుపట్టారు. భక్తితో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులను చంద్రబాబు, టీడీపీ నేతలు నిర్బంధించి వేధించారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రసంగం మొదలవడానికి కాసేపు ముందే భక్తులు బయటకు వెళ్లకుండా గేట్లు మూసేశారని, రవాణా వ్యవస్థను స్తంభింప చేస్తూ వచ్చారని అంబటి చెప్పారు. అలా భక్తులు అక్కడి నుంచి వెళ్లకుండా నిర్భంధించి మరీ చంద్రబాబు ప్రసంగాలు చేశారన్నారు. ఆ ప్రసంగాలు కూడా పుష్కరాల గురించో, కృష్ణమ్మ గురించో కాకుండా సొంత డబ్బా కొట్టుకున్నారని అంబటి విమర్శించారు. పైగా సంకల్పం పేరుతో కుడివైపు చాతీ మీద చేయి వేసుకుని చంద్రబాబు ప్రమాణం చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. మనిషికి ఎక్కడైనా కుడివైపు గుండె ఉంటుందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. భక్తులకు పీఠాధిపతులతో ప్రసంగాలు ఇప్పించాల్సింది పోయి పుష్కరాల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరకు పుష్కర ఘాట్లకు కూడా పచ్చరంగు వేసుకుని ప్రచారం చేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పవిత్రమైన పుష్కరాలు జరుగుతున్న చోట వందల సంఖ్యలో చంద్రబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఫ్యాంట్లు, షర్ట్, షూ వేసుకుని పుష్కర స్నానం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న ఇలాంటి పాపాల వల్లే నెల రోజులుగా వర్షాలు కూడా పడడం లేదన్న భావన జనంలో ఉందన్నారు అంబటి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News