భ‌ర్త‌గా న‌టించ‌మంటే... రేప్ చేశాడు..!

ఈడొచ్చిన యువ‌తి.. జీవితం మీద ఎన్నో ఆశ‌లు.. ఇంట్లోవారు పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి.. దీంతో ఓ న‌కిలీ భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేస్తుంది.  ఈలోగా తాను అనుకున్న‌ది సాధించి.. త‌ల్లిదండ్రుల‌కు అస‌లు విష‌యం చెబుతుంది.. దీంతో సినిమాకు శుభం కార్డుప‌డుతుంది. ఇది తెలుగుసినిమాల్లో క‌నిపించే సంప్ర‌దాయ‌మైన‌.. ప‌ర‌మ రొటీన్ క‌థ‌. ఇదే క‌థ‌ను ఫాలో అయిన ఓ పుణె యువ‌తి క‌థ అడ్డం తిరిగింది. భ‌ర్త‌గా న‌టించ‌మని అన్న త‌న స్నేహితుడు ఏకంగా భ‌ర్త‌లా జీవించేశాడు.. అదేనండీ.. అత్యాచారం […]

Advertisement
Update: 2016-08-21 21:00 GMT
ఈడొచ్చిన యువ‌తి.. జీవితం మీద ఎన్నో ఆశ‌లు.. ఇంట్లోవారు పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి.. దీంతో ఓ న‌కిలీ భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేస్తుంది. ఈలోగా తాను అనుకున్న‌ది సాధించి.. త‌ల్లిదండ్రుల‌కు అస‌లు విష‌యం చెబుతుంది.. దీంతో సినిమాకు శుభం కార్డుప‌డుతుంది. ఇది తెలుగుసినిమాల్లో క‌నిపించే సంప్ర‌దాయ‌మైన‌.. ప‌ర‌మ రొటీన్ క‌థ‌. ఇదే క‌థ‌ను ఫాలో అయిన ఓ పుణె యువ‌తి క‌థ అడ్డం తిరిగింది. భ‌ర్త‌గా న‌టించ‌మని అన్న త‌న స్నేహితుడు ఏకంగా భ‌ర్త‌లా జీవించేశాడు.. అదేనండీ.. అత్యాచారం చేశాడు.. వివ‌రాలు..పుణె కుచెందిన ఓ యువ‌తికి ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నార‌ని తెలిసి వాటిని త‌ప్పించుకునేందుకు ఓ ఐడియా వేసింది. త‌న స్నేహితుడిని భ‌ర్త‌లా న‌టించ‌మ‌ని కోరింది. అత‌డు అంగీక‌రించ‌గానే తీసుకెళ్లి త‌న త‌ల్లిదండ్రుల‌కు త‌న భ‌ర్త‌గా ప‌రిచ‌యం చేసింది. ఇందుకోసం ఓ న‌కిలీ పెళ్లి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని కూడా సృష్టించింది. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న స‌ద‌రు స్నేహితుడు నిజంగానే వారికి పెళ్ల‌యిన‌ట్లు స‌ర్టిఫికెట్లు తీసుకున్నాడు. ఓ రోజు ఆ యువ‌తిపై ప‌డి ప‌శువులా త‌న కోరిక తీర్చుకున్నాడు. దీంతో తాను చేసిన త‌ప్పు ఎంతటి త‌ప్పిదానికి కార‌ణ‌మైందో యువ‌తికి అర్థ‌మైంది. వెంట‌నే అమ్మానాన్న‌ల‌కు అస‌లు విష‌యం చెప్పి బోరుమంది. ఎంతైనా క‌న్న‌వారు క‌దా! త‌మ బిడ్డ‌కు జ‌రిగిన అన్యాయానికి కుంగిపోయారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు న‌మోదు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News