ఏపీలో కులపిచ్చిపై "ద హిందూ" కథనం

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయాల్సిందిగా అందరూ కోరుతుంటారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రక్తదానం విషయంలోనూ కుల పిచ్చి ఆవరించింది. ఆ మధ్య గుంటూరులో జరిగిన ఒక కుల సమావేశంలో కొందరు కుల పెద్దలు తమ కులానికి సంబంధించిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ… మన కులం వాళ్ల రక్తాన్ని మరో కులం వారికి ఎక్కించవద్దు, అదే సమయంలో వేరే కులం వాళ్ల రక్తం ఎక్కించుకోవద్దని అనాగరికంగా వేదికపై నుంచే పిలుపునిచ్చారు. ఆ పిలుపునిస్తున్న సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన […]

Advertisement
Update: 2016-08-20 01:02 GMT

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయాల్సిందిగా అందరూ కోరుతుంటారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రక్తదానం విషయంలోనూ కుల పిచ్చి ఆవరించింది. ఆ మధ్య గుంటూరులో జరిగిన ఒక కుల సమావేశంలో కొందరు కుల పెద్దలు తమ కులానికి సంబంధించిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ… మన కులం వాళ్ల రక్తాన్ని మరో కులం వారికి ఎక్కించవద్దు, అదే సమయంలో వేరే కులం వాళ్ల రక్తం ఎక్కించుకోవద్దని అనాగరికంగా వేదికపై నుంచే పిలుపునిచ్చారు. ఆ పిలుపునిస్తున్న సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వేదికపైనే ఉన్నారు. ఆ పిలుపు ప్రభావమో ఏమో గానీ ఏపీలో కొందరు రక్తం ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా కులం చూడడం మొదలుపెట్టారు. సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈపోకడ ఇప్పుడు బహిరంగంగానే చలామణి అవుతోంది (ఆ వీడియోను క్రింద జత చేస్తున్నాం చూడండి).

రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి తమ మూడేళ్ల పాపకు రక్తం కావాలంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తమ మూడేళ్ల పాపకు తన కులం వాళ్ల రక్తం మాత్రమే కావాలని సూచించారు. దీనిపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. మూడేళ్ల పాప ఆపదలో ఉంటే సిగ్గులేకుండా సొంత కుల రక్తమే కావాలంటావా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు కులరక్త పిచ్చి జాతీయస్థాయిలో వార్త అయింది. దేశంలో ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ద హిందూ ఇక్కడి కుల పిచ్చిపై ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. సదరు కులాన్ని కూడా నేరుగానే ప్రస్తావించింది. ఏపీలో జనం అనాగరికత వైపు తిరోగమిస్తున్నారన్న దానికి ఈ కుల రక్తదానం కాన్సెప్టే నిదర్శనమంటున్నారు. ఇది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన దారుణం.

WATCH VIDEO:

Full View

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News