మునుముందు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం ఉంటుంది- కమలానంద

కృష్ణా పుష్కరాలు జరుగుతున్న తీరుపై దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టినా ఎక్కడా కూడా అధ్యాత్మిక భావన కనిపించడం లేదన్నారు. ఇక్కడికి వస్తున్న భక్తుల్లోనూ అది కనిపించడం లేదన్నారు. పుష్కరాల పేరుతో ఆలయాలు కూల్చడం కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఆలయాలు కూల్చిన ప్రభావం మునుముందు ప్రభుత్వంపైనా ఉంటుందని కమలానంద చెప్పారు. గోదావరి పుష్కరాల్లో ఎదురైన అనుభవాలు భక్తులను వెంటాడుతున్నట్టుగా ఉన్నాయన్నారు. అందుకే చాలా మంది […]

Advertisement
Update: 2016-08-17 22:02 GMT

కృష్ణా పుష్కరాలు జరుగుతున్న తీరుపై దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టినా ఎక్కడా కూడా అధ్యాత్మిక భావన కనిపించడం లేదన్నారు. ఇక్కడికి వస్తున్న భక్తుల్లోనూ అది కనిపించడం లేదన్నారు.

పుష్కరాల పేరుతో ఆలయాలు కూల్చడం కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఆలయాలు కూల్చిన ప్రభావం మునుముందు ప్రభుత్వంపైనా ఉంటుందని కమలానంద చెప్పారు. గోదావరి పుష్కరాల్లో ఎదురైన అనుభవాలు భక్తులను వెంటాడుతున్నట్టుగా ఉన్నాయన్నారు. అందుకే చాలా మంది ఘాట్ల వద్దకు వచ్చేందుకు వెనుకాడుతున్నారన్నారు.

ప్రభుత్వం చేసిన ముందస్తు ఆర్భాటం కూడా ప్రజలను భయపెట్టిందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో భక్తులు బెంబేలెత్తుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆంక్షలు సడలించి భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని సూచించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News