డీఎస్పీ, సీఐ పేర్లు రాసి రామకృష్ణారెడ్డి ఆత్మహత్య

మెదక్‌ జిల్లా  కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్‌ కూడా రాశారు. మామూళ్ల కోసం తనను వేధిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ క్యార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే భార్య పిల్లలను పుట్టింటికి పంపించిన రామకృష్ణ… రాత్రి భార్యకు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేస్తానని చెప్పారు. వేధింపులు భరించలేకపోతున్నానని ఆవేదన […]

Advertisement
Update: 2016-08-16 22:43 GMT

మెదక్‌ జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్‌ కూడా రాశారు. మామూళ్ల కోసం తనను వేధిస్తున్నారని వెల్లడించారు. పోలీస్ క్యార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే భార్య పిల్లలను పుట్టింటికి పంపించిన రామకృష్ణ… రాత్రి భార్యకు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేస్తానని చెప్పారు. వేధింపులు భరించలేకపోతున్నానని ఆవేదన చెందారు.

ఆత్మహత్యకు ముందు ఇద్దరు కానిస్టేబుళ్లకు రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు. తాను వెళ్లిపోతున్నానని జాగ్రత్త అంటూ వారికి చెప్పారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ ఎస్ఐ కమలాకర్ కానిస్టేబుళ్లతో కలిసి క్యార్టర్స్‌కు వెళ్లే లోపే రామకృష్ణారెడ్డి చనిపోయి ఉన్నారు. రామకృష్ణారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం. కొంతకాలం ఆర్మీలో పనిచేసిన రామకృష్ణారెడ్డి 2007లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఈయన గతంలో హైదరాబాద్‌లో సుల్తాన్‌బజార్, లక్డీకాపూల్ పీఎస్‌లో పనిచేశారు. రామకృష్ణారెడ్డికి ఇద్దరు అన్నయ్యలు. ఒకాయన తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. మరొక అన్న ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. రామకృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్‌లో చెప్పిన డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యలు కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే రామకృష్ణారెడ్డి ఇందుకు అంగీకరించలేదని చెబుతున్నారు. అప్పటి నుంచే వేధింపులు మరింత అధికమయ్యాయంటున్నారు. డీఎస్పీ, సీఐను కఠినంగా శిక్షించాలని రామకృష్ణారెడ్డి కుటుంబం డిమాండ్ చేస్తోంది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News