ఘాట్ల వద్ద కనిపించని రద్దీ... చంద్రబాబు వివరణ

కృష్ణ పుష్కరాల్లో తొలిరోజు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదు. విజయవాడలోని ఘాట్లతో పాటు అనేక చోట్ల జనం పలుచగానే కనిపించారు. గోదావరి పుష్కరాల తొలిరోజుతో పోలిస్తే కృష్టా పుష్కరాల తొలి రోజు రద్దీ చాలా తక్కువగా ఉంది. దీనిపై చంద్రబాబునాయుడు స్పందించారు. శ్రావణ శుక్రవారం కావడంతోనే భక్తులు తక్కువగా వచ్చారని చంద్రబాబు వివరించారు. శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని… నగరంలో గుళ్లను తొలగిస్తుంటే కొందరు గగ్గోలు పెట్టారని… అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి […]

Advertisement
Update: 2016-08-11 23:07 GMT

కృష్ణ పుష్కరాల్లో తొలిరోజు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదు. విజయవాడలోని ఘాట్లతో పాటు అనేక చోట్ల జనం పలుచగానే కనిపించారు. గోదావరి పుష్కరాల తొలిరోజుతో పోలిస్తే కృష్టా పుష్కరాల తొలి రోజు రద్దీ చాలా తక్కువగా ఉంది. దీనిపై చంద్రబాబునాయుడు స్పందించారు. శ్రావణ శుక్రవారం కావడంతోనే భక్తులు తక్కువగా వచ్చారని చంద్రబాబు వివరించారు. శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని… నగరంలో గుళ్లను తొలగిస్తుంటే కొందరు గగ్గోలు పెట్టారని… అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు.

అయితే పుష్కరాల తొలి రోజు రద్దీ తక్కువగా ఉండడానికి గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రమాదం కూడా ఒక కారణమని చెబుతున్నారు. గోదావరి పుష్కరాల తొలిరోజు లక్షలాది మంది తరలిరావడం, అదే సమయంలో చంద్రబాబు షార్ట్‌ ఫిల్మ్ కోసం తీరిగ్గా స్నానమాచరించడం ఇంతలోనే తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవడం అయింది. కాబట్టి తొలి రోజు వెళ్లి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశం వల్లే భక్తుల రద్దీ తక్కువగా ఉందని కూడా భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News