టీడీపీ అనుకూల పత్రికపైనే రేవంత్‌ అనుమానం...

నయీం ఎదుగుదల వెనుక టీడీపీ మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఉన్నారంటూ కథనాలు రావడంపై రేవంత్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా తెలంగాణలో ఒక సామాజికవర్గాన్ని కేసీఆర్‌ టార్గెట్ చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి … ఉమా మాధవరెడ్డిపై ఆరోపణల విషయంలోనూ అదే ధోరణిలో స్పందించారు. తెలంగాణలో గౌరవప్రదంగా బతుకుతున్న కొన్ని కుటుంబాలను కేసీఆర్‌ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఉమా మాధవరెడ్డి కుటుంబంపై కేసీఆర్‌ […]

Advertisement
Update: 2016-08-11 09:39 GMT

నయీం ఎదుగుదల వెనుక టీడీపీ మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఉన్నారంటూ కథనాలు రావడంపై రేవంత్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా తెలంగాణలో ఒక సామాజికవర్గాన్ని కేసీఆర్‌ టార్గెట్ చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి … ఉమా మాధవరెడ్డిపై ఆరోపణల విషయంలోనూ అదే ధోరణిలో స్పందించారు. తెలంగాణలో గౌరవప్రదంగా బతుకుతున్న కొన్ని కుటుంబాలను కేసీఆర్‌ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఉమా మాధవరెడ్డి కుటుంబంపై కేసీఆర్‌ లీకు వార్తలు రాయిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడే మరో కీలకమైన అనుమానాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. పరోక్షంగా టీడీపీ అనుకూల పత్రికల వ్యవహారశైలిపైనా అనుమానం వ్యక్తం చేశారు. ”ఇప్పటి వరకు మాకు కొన్ని పత్రికలు, ఛానళ్ల నిబద్ధత పట్ల ఎలాంటి అనుమానం లేదు. కానీ వరుస కథనాలు చూస్తుంటే నిబద్ధత ప్రశ్నించాల్సిన విధంగా వాటి వ్యవహార శైలి ఉంటోంది” అని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ అనుమానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే…

ఇది వరకు ఆయనకు నిబద్ధత కనిపించిన పత్రికల జాబితాలో సాక్షి గానీ, నమస్తే తెలంగాణ గానీ లేవు. ఇక టీడీపీకి అనుకూలంగా పనిచేసే ఆ రెండు పత్రికలపైనే ఇదివరకు రేవంత్‌కు గట్టి నమ్మకం ఉండి ఉండాలి. అంతేకాదు చంద్రబాబు తోక పత్రికగా ముద్రపడిన ఒక పత్రికే ఉమా మాధవరెడ్డి గురించి ఘాటుగా కథనం రాసింది. సదరు మాజీ మంత్రిపై కేసు పెట్టడమే కాదు… వెంటనే అరెస్ట్ కూడా చేస్తారంటూ చంద్రబాబు తోక పత్రిక అచ్చేసింది. ఇంత తీవ్రంగా మిగిలిన మీడియా సంస్థలు కథనాలు రాయలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి శంకిస్తున్న పత్రిక చంద్రబాబు తోక పత్రికే అయి ఉండాలి. పైగా సదరు పత్రిక యజమాని, కేసీఆర్ మధ్య కొద్దినెలల క్రితం వరకు ప్రత్యక్షంగానే పోరు నడిచింది. కానీ ఇప్పుడు కేసీఆర్‌, సదరు పత్రిక యజమాని చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నది చాలామందికి తెలిసిన విషయమే. అంటే తెలంగాణలో ఒకసామాజికవర్గాన్ని దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఉమా మాధవరెడ్డి చేసిన ఆరోపణ, రేవంత్‌ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానం బట్టి చూస్తుంటే… ఒక వర్గం నాయకులను తెలంగాణలో అణచివేసేందుకు కేసీఆర్‌తోపాటు చంద్రబాబు తోక మీడియా కూడా ప్రయత్నిస్తోందనే అనుకోవాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News