భ‌ర్త‌ల‌ను చంపారు... లోకేశ్‌ ఆమోదించారు!

ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ప్ర‌జాభిమానం చూర‌గొనేందుకు పోటీప‌డుతూ క‌నీస విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇస్తున్నారు. జిల్లాలో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి ఇటీవ‌ల టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటికి, అద్దంకి టీడీపీ ఇన్‌ఛార్జి క‌ర‌ణం బ‌లరాం మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇందులో భాగంగా భ‌ర్త‌లు బ‌తికుండగానే చంపేసిన‌ట్లు చూపుతూ వారి భార్య‌ల‌కు పించ‌న్లు మంజూరు చేసే నీతిమాలిన ప‌నికి శ్రీ‌కారం చుట్టారు కొంద‌రు టీడీపీ […]

Advertisement
Update: 2016-08-09 21:35 GMT
ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ప్ర‌జాభిమానం చూర‌గొనేందుకు పోటీప‌డుతూ క‌నీస విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇస్తున్నారు. జిల్లాలో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి ఇటీవ‌ల టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటికి, అద్దంకి టీడీపీ ఇన్‌ఛార్జి క‌ర‌ణం బ‌లరాం మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇందులో భాగంగా భ‌ర్త‌లు బ‌తికుండగానే చంపేసిన‌ట్లు చూపుతూ వారి భార్య‌ల‌కు పించ‌న్లు మంజూరు చేసే నీతిమాలిన ప‌నికి శ్రీ‌కారం చుట్టారు కొంద‌రు టీడీపీ నేత‌లు. ఇటీవ‌ల స్థానిక టీడీపీ నేత క‌ర‌ణం బ‌లరాంకు పోటీగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ 2,800 పించ‌న్లు మంజూరు చేయించారు. ఈ జాబితాను సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ కు ఇచ్చి ఆమోదించుకున్నారు. ఇందులో కొన్ని అక్ర‌మ వితంతు పించ‌న్లు ఉండ‌టంతో జిల్లాలో పార్టీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిసినంత ప‌నైంది.
మొత్తం 2,800 పించ‌న్ల‌లో బుల్లి కుర‌వ మండ‌లంలో 706 పింఛ‌న్లను ఎమ్మెల్యే గొట్టిపాటి స్వ‌యంగా ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేశారు. వీరిలో వితంతు పించ‌న్లు పొందిన ఏడుగురు మ‌హిళ‌ల భ‌ర్త‌లు బ‌తికే ఉన్నార‌ని తెలియ‌డంతో క‌ల‌క‌లం రేగింది. దీనిపై విచార‌ణ ప్రారంభించిన‌ ఎంపీడీవో స‌ద‌రు ఏడుగురు మ‌హిళ‌ల భ‌ర్త‌లు బ‌తికే ఉన్నార‌ని నిర్ధారించారు. ఈ ఏడుగురు కూడా గ‌తేడాది డిసెంబ‌రు12 నాడే మ‌ర‌ణించిన‌ట్లు న‌కిలీ మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జారీ అయిన విష‌యం తెలుసుకున్నఅధికారులు హ‌తాశ‌యుల‌య్యారు. అధికారుల సంత‌కాలు మార్చి ఇలాంటి న‌కిలీ స‌ర్టిఫికెట్లు పుట్టించార‌ని విచార‌ణ‌లో తేలింది. దీని వెన‌క టీడీపీ నేత‌ల హ‌స్త‌ముంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు అధికారులు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News