ఏపీ మంత్రుల వైభవాన్ని బయటపెట్టిన నివేదిక

మాది పూర్‌ స్టేట్‌ అని చెప్పుకునే చంద్రబాబు చెంతన ఉన్న మంత్రులు మాత్రం అత్యంత ధనవంతులని ఒక నివేదిక తేల్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో అందరు మంత్రుల ఆస్తుల వివరాలను ఆసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సేకరించింది. మొత్తం 620 మంది మంత్రుల్లో 609మంది మంత్రుల వివరాలను బయటపెట్టింది. ఈ జాబితాలో అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 496కోట్లు […]

Advertisement
Update: 2016-08-05 21:14 GMT

మాది పూర్‌ స్టేట్‌ అని చెప్పుకునే చంద్రబాబు చెంతన ఉన్న మంత్రులు మాత్రం అత్యంత ధనవంతులని ఒక నివేదిక తేల్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో అందరు మంత్రుల ఆస్తుల వివరాలను ఆసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సేకరించింది. మొత్తం 620 మంది మంత్రుల్లో 609మంది మంత్రుల వివరాలను బయటపెట్టింది. ఈ జాబితాలో అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 496కోట్లు (ఇది ప్రభుత్వ రికార్డుల ప్రకారం విలువ. నిజానికి ఆయన ఆస్తుల మార్కెట్ విలువ ఎంతో ఎక్కువుంటుంది.). ఆ తర్వాత మరే మంత్రి కూడా నారాయణకు దరిదాపుల్లో లేరు. కర్నాటక మంత్రి శివకుమార్ రూ. 251 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తులు సగటు విలువ రూ. 8. 59 కోట్లు కాగా… ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ. 45. 49కోట్లుగా ఉంది. ఏపీ తర్వాత కర్నాటక మంత్రుల ఆస్తుల సగటు విలువ అధికంగా ఉంది. త్రిపుర రాష్ట్ర మంత్రుల ఆస్తుల సగటు విలువ అతి తక్కువగా రూ. 31.67లక్షలుగా ఉంది. కోటిశ్వరుల జాబితాలో ఏపీ మంత్రుల్లో మెజారిటీ సభ్యులు ముందు వరుసలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా 210 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. 113మందిపై తీవ్రమైన హత్య, కిడ్నాప్ కేసులున్నాయి. మొత్తం మీద దేశంలోనే అత్యంత ధనవంతులైన మంత్రులకు నెలవుగా ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలిచింది. పూర్‌ స్టేట్‌ను ఏలుతున్న రిచ్‌ మినిస్టర్స్‌ అన్న మాట.

Click on Image to Read:

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

Tags:    
Advertisement

Similar News