మోదీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

బావ చంద్రబాబు కేంద్రంతో గొడవ పడితే మనకేనష్టమని చెబుతుండగా… బామ్మర్ధి బాలకృష్ణ మాత్రం కేంద్రంపై తొడ కొట్టారు. కేంద్రాన్ని ”నా తరపు నుంచి హెచ్చరిస్తున్నా” అని ఘాటుగా మాట్లాడారు. హిందూపురం సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడికి వివరించేందుకు సచివాలయం వచ్చిన బాలకృష్ణ … ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గతంలోనే హోదాపై కేంద్రాన్ని తాను ఒకసారి హెచ్చరించానని… ఇప్పుడు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నానని చెప్పారు. ప్రాధేయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. హోదా ఇవ్వకుంటే పరిణామాలు […]

Advertisement
Update: 2016-08-04 01:24 GMT

బావ చంద్రబాబు కేంద్రంతో గొడవ పడితే మనకేనష్టమని చెబుతుండగా… బామ్మర్ధి బాలకృష్ణ మాత్రం కేంద్రంపై తొడ కొట్టారు. కేంద్రాన్ని ”నా తరపు నుంచి హెచ్చరిస్తున్నా” అని ఘాటుగా మాట్లాడారు. హిందూపురం సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడికి వివరించేందుకు సచివాలయం వచ్చిన బాలకృష్ణ … ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

గతంలోనే హోదాపై కేంద్రాన్ని తాను ఒకసారి హెచ్చరించానని… ఇప్పుడు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నానని చెప్పారు. ప్రాధేయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టవద్దని సూచించారు. ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలని కాంగ్రెస్‌ నేతలు అప్పట్లో బల్లగుద్ది( నిజానికి ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలన్నది కాంగ్రెస్ వాళ్లు కాదు, వెంకయ్యనాయుడు) వాదించారని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమకు పౌరుషం తగ్గలేదని బాలయ్య పంచ్‌ డైలాగులు కొట్టారు. సీఎం ఢిల్లీ వెళ్లారని కేంద్రంపై ఒత్తిడి తెస్తారన్నారు బాలయ్య. కేంద్రం దిగిరాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని… అంత దూరం పరిస్థితిని తెచ్చుకోవద్దని మోదీ సర్కార్ ను బాలకృష్ణ హెచ్చరించారు. అయినా మోదీ పవర్ చూసి చంద్రబాబే ఎక్కడికక్కడ బెండ్ అవుతుంటే ఇక బాలకృష్ణ హెచ్చరికలకు చింతకాయలు రాలుతాయా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News