టీడీపీ నేత‌ల‌కు అక్క‌డ ఏంప‌ని?

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూనిర్వాసితుల ఆందోళ‌న‌లో పోలీసుల‌పై రాళ్లు రువ్వింది టీడీపీ నేత‌లేనని మంత్రి హ‌రీశ్‌రావు ఆరోపించారు. ప్ర‌శాంతంగా ఆందోళ‌న చేస్తోన్న రైతుల మ‌ధ్య‌లోకి టీడీపీ నేత‌లు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. రైతుల మ‌ధ్య‌లో దూరి పోలీసుల‌పై రాళ్లు విస‌ర‌డంతోనే.. లాఠీఛార్జికి దారి తీసి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌న్నారు. రైతులు ఎంత ఆందోళ‌న చేసినా.. సంయ‌మ‌నంతో ఉండాల‌ని ముందుగానే పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చామ‌ని ఆయ‌న మీడియాకు తెలిపారు. పోలీసులు గాయ‌ప‌డ్డా సంయ‌మనం పాటించార‌ని..కానీ రైతుల ముసుగులో ఆందోళ‌న‌లో […]

Advertisement
Update: 2016-07-25 00:21 GMT
మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూనిర్వాసితుల ఆందోళ‌న‌లో పోలీసుల‌పై రాళ్లు రువ్వింది టీడీపీ నేత‌లేనని మంత్రి హ‌రీశ్‌రావు ఆరోపించారు. ప్ర‌శాంతంగా ఆందోళ‌న చేస్తోన్న రైతుల మ‌ధ్య‌లోకి టీడీపీ నేత‌లు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. రైతుల మ‌ధ్య‌లో దూరి పోలీసుల‌పై రాళ్లు విస‌ర‌డంతోనే.. లాఠీఛార్జికి దారి తీసి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌న్నారు. రైతులు ఎంత ఆందోళ‌న చేసినా.. సంయ‌మ‌నంతో ఉండాల‌ని ముందుగానే పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చామ‌ని ఆయ‌న మీడియాకు తెలిపారు. పోలీసులు గాయ‌ప‌డ్డా సంయ‌మనం పాటించార‌ని..కానీ రైతుల ముసుగులో ఆందోళ‌న‌లో క‌లిసిపోయిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లే పోలీసుల‌పై రాళ్లు విసిరి వారిని గాయ‌ప‌రిచార‌ని ఆరోపించారు.
ఎవ‌రీ వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రైతువిభాగం అధ్యక్షుడు వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి. ఈయ‌న 2014లో గ‌జ్వేల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేశారు. కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. మొద‌టి నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు ప‌రిధిలో ముంపున‌కు గుర‌వుతున్న 14 గ్రామాల ప్ర‌జ‌ల‌కు సంఘీభావంగా నిర‌స‌న‌లు తెలుపుతూ వ‌స్తున్నారు. అయితే, ఆదివారం అక‌స్మాత్తుగా రైతులు నిర్వ‌హించ త‌ల‌పెట్టిన రాజీవ్ రహ‌దారి దిగ్బంధ‌నంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ఆయ‌న వెంట భారీ సంఖ్య‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అనుచ‌రులు కూడా ఆందోళ‌న‌లో ఉన్నారు. అయితే, పోలీసులపైకి వీరే రాళ్లు విసిరి ఆందోళ‌న ఉద్రిక్త‌మయ్యేందుకు కార‌ణ‌మ‌య్యార‌ని మంత్రి హ‌రీశ్ ఆరోపిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News