అంతా వైఎస్సే చేశారంటున్న టీ కాంగ్రెస్ నేతలు

మేం చేసిన ప‌నుల‌ను కేసీఆర్ ప్రభుత్వం త‌మ‌వ‌ని చెప్పుకుంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ చేపట్టిన జ‌ల‌య‌జ్ఞం ప‌నులు నేటికి 90 శాతం పూర్త‌య్యాయ‌ని వాటికే కేసీఆర్ ప్ర‌భుత్వం రిబ్బ‌న్ క‌టింగ్‌లు చేస్తూ త‌మ ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నార‌ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క  ఆరోపించారు. తమ ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌ను మీ ప‌నుల‌ని ఎలా చెప్పుకుంటారు? అని  ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.  సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను టీఆర్ ఎస్ ప‌క్క‌దోవ ప‌ట్టిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. […]

Advertisement
Update: 2016-07-22 23:34 GMT
మేం చేసిన ప‌నుల‌ను కేసీఆర్ ప్రభుత్వం త‌మ‌వ‌ని చెప్పుకుంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ చేపట్టిన జ‌ల‌య‌జ్ఞం ప‌నులు నేటికి 90 శాతం పూర్త‌య్యాయ‌ని వాటికే కేసీఆర్ ప్ర‌భుత్వం రిబ్బ‌న్ క‌టింగ్‌లు చేస్తూ త‌మ ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నార‌ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తమ ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌ను మీ ప‌నుల‌ని ఎలా చెప్పుకుంటారు? అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను టీఆర్ ఎస్ ప‌క్క‌దోవ ప‌ట్టిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. పాల‌మూరు జిల్లాలోని కోయ‌ల్‌సాగ‌ర్‌, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను మేం దిగిపోయేనాటికి 90 శాతం ప‌నుల‌ను పూర్తి చేశామ‌న్నారు.
జలయజ్ఞంపై గ‌తంలో వైఎస్ ను వ్య‌తిరేకించిన వారంతా ఇప్పుడు ప్ర‌శంసిస్తుండ‌టం చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో చేప‌డుతున్న సాగునీటి ప్రాజెక్టుల‌కు దివంగ‌త నేత వైఎస్ స్ఫూర్తి అని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, నీటిపారుద‌ల రంగ నిపుణుడు విద్యాసాగ‌ర్ రావు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఒక‌డుగు ముందుకు వేసి వైఎస్ చేప‌ట్టిన సాగునీటి ప్రాజెక్టుల‌కు టీఆర్ ఎస్ శంకుస్థాప‌న చేస్తోంద‌ని ఆరోపించారు. మొత్తానికి వైఎస్‌ను నాడు త‌ప్పుబ‌ట్టిన వారే.. నేడు పొగుడుతున్నారు. తెలంగాణలో వైసీపీ తమకు పోటీదారు కాదన్న భావనతోనే ఆ ప్రాంత నేతలు ఓపెన్ గా మాట్లాడుతున్నట్టుగా ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News