అణు విద్యుత్‌ కేంద్రంపై బాబుకు శర్మ సూటి ప్రశ్నలు

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రయత్నాలపై అక్కడి ప్రజలు తిరగబడేందుకు సిద్దమవుతున్నారు. అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఎం ఆధ్వర్యంలో “అణు విద్యుత్ ఒప్పందం – దాని పర్యావసానాలు” అన్న అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌ హాజరయ్యారు. ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలని ప్రకాశ్‌ కారత్‌ పిలుపునిచ్చారు. ఈ ప్లాంట్‌ వల్ల ఉత్తరాంధ్ర పెనుప్రమాదంలో పడుతుందని […]

Advertisement
Update: 2016-07-17 09:43 GMT

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రయత్నాలపై అక్కడి ప్రజలు తిరగబడేందుకు సిద్దమవుతున్నారు. అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఎం ఆధ్వర్యంలో “అణు విద్యుత్ ఒప్పందం – దాని పర్యావసానాలు” అన్న అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌ హాజరయ్యారు. ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలని ప్రకాశ్‌ కారత్‌ పిలుపునిచ్చారు. ఈ ప్లాంట్‌ వల్ల ఉత్తరాంధ్ర పెనుప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ప్రసంగించిన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, శర్మ .. అణు ప్లాంట్ విషయంలో మోదీ, చంద్రబాబులకు కొన్నిసూటి ప్రశ్నలు సంధించారు.

శర్మ ప్రశ్నలు..

1. వరల్డ్ బ్యాంక్ అణువిద్యుత్ ప్లాంట్‌లకు లోన్లు ఎందుకు ఇవ్వడం లేదు?

2. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా అణు విద్యుత్ ప్లాంట్లకు ఇన్సురెన్స్ ఇవ్వడానికి ఎందుకు ముందుకురావడం లేదు?.

3. భోపాల్‌లో జరిగిన ప్రమాదమే ఇక్కడ కూడా జరిగితే నష్టం ఎవరు భరిస్తారు?.

4. అమెరికాలో 1979 నుండి ఒక్క అణు రియాక్టర్ కూడా ఎందుకు పెట్టలేదు?.. భారతదేశం బకరాగా కనిపిస్తోందా?. అమెరికా క్యాలిపోర్నియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్దని చట్టంచేశారు. మొన్న ఒకటి మూసేశారు. ఉన్న ఇంకొకటి 2024 లో మూసివేస్తున్నారు? అక్కడ మూసివేస్తున్న అణు శక్తి కేంద్రాలు ఇక్కడ అవసరమా? .

5. ప్రాజెక్టు చూట్టూ 1. 06 కిలో మీటర్ల లోపు ఎందుకు ప్రజలు ఉండకూడదని జీవోలో ఉంది. అణు కేంద్రం అంత సేఫ్ అయితే వారు ఎందుకు ఉండకూడదు. 5 కిలో మీటర్లు వరకు అభివృద్ది కార్యక్రమలు చేయడానికి వీలు లేదు. కొవ్వాడ పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో అభివృద్ది చేయకూడదని అనుకుంటున్నారు. కారణం ఏంటి?. 30 కిలో మీటర్లు రేడియేషన్ ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి.

6. కొవ్వాడలో 6 యూనిట్స్ అంటే 6వేల మెగావాట్స్..ప్రమాదం జరిగితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది.

7. ఇటువంటి ప్లాంట్లలో ప్రమాదాలు జరిగితే బయటకు తెలిసే పరిస్ధితి ఉండదు. కుడంకుళంగానీ, ఇతర కంపెనీలలో కానీ ఇదే పరిస్ధితి కనిపిస్తుంది. గుజరాత్‌లో కకర్ తాల్ అనే ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరిగితే కంపెనీ కానీ, అధికారులు కానీ బయటకు రానివ్వలేదు. మరీ ఇక్కడ ప్రమాదాలు జరిగితే ఏం చేస్తారు?. అని శర్మ ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News