కష్టపడ్డారు కాబట్టే ఒకే వర్గానికి పదవులు... నా భార్య విషయంలో సీఎం హెచ్చరించలేదు

తాను మంత్రి పదవిని కొనుక్కోలేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ప్రతిపక్షంలోఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశాను కాబట్టే మంత్రి పదవి వచ్చిందన్నారు. రాజధానిలో భూములు కొన్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ బినామీలుగా చెబుతున్న సురేష్, రాజా ఎవరూ కూడా తనకు తెలియదన్నారు. వారి పేరుతో తాను 196 ఎకరాల భూమిని కొన్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తన భార్య పేరు మీద కూడా భూములు కొనలేదన్నారు. ఆదివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన […]

Advertisement
Update: 2016-07-17 09:12 GMT

తాను మంత్రి పదవిని కొనుక్కోలేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ప్రతిపక్షంలోఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశాను కాబట్టే మంత్రి పదవి వచ్చిందన్నారు. రాజధానిలో భూములు కొన్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ బినామీలుగా చెబుతున్న సురేష్, రాజా ఎవరూ కూడా తనకు తెలియదన్నారు. వారి పేరుతో తాను 196 ఎకరాల భూమిని కొన్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తన భార్య పేరు మీద కూడా భూములు కొనలేదన్నారు. ఆదివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పత్తిపాటి పలు విషయాలపై స్పందించారు.

తన శాఖలోని అధికారులకు తన భార్య ఫోన్‌ చేసి ఆదేశాలు జారీ చేయడం లేదన్నారు. ఐఏఎస్‌లను ఫోన్‌ చేసి తన భార్య తిట్టారనడం అబద్దమన్నారు. కేవలం తాను అందుబాటులో లేనప్పుడు కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు వస్తే వారి సమస్యల పరిష్కారానికి తన భార్య ప్రయత్నించి ఉంటారన్నారు. తను ఎక్కడా అవినీతికి పాల్పడడం లేదని… ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు.

పత్తిపాటి పుల్లారావు తన సామాజికవర్గం వారికే పెద్దపీట వేస్తారనడం సరికాదన్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే మీ సామాజికవర్గానికే చెందిన ఇద్దరు ఎంపీలు, ఏడుగులు ఎమ్మెల్యేలు ఉండగా… అదే జిల్లా నుంచి అదే సామాజికవర్గానికి చెందిన నన్నపనేని రాజకుమారి, కోటేశ్వరరావు, సాయిబాబాలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖలో వేసిన పాలకమండల్లో ముగ్గురినీ అదే సామాజికవర్గం వారిని నియమించింది నిజం కాదా అని ప్రశ్నించగా అందుకు పత్తిపాటి సమాధానం చెప్పారు. కులం ప్రాతిపదిక కాదని ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడ్డందుకే పదవులు వచ్చాయన్నారు. మరి మిగిలిన సామాజికవర్గాల వారికి నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించగా… ఒకరి పేరును ప్రతిపాదిస్తుంటే మరో నలుగురు పోటీలోకి వస్తున్నారని అందువల్లే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

చిలకలూరిపేట జర్నలిస్ట్‌ను హత్య చేసిన వారిని తాను కాపాడడం లేదన్నారు పత్తిపాటి. అదంతా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అన్నారు. పించన్ ఇవ్వాలంటే 500, ఇంటి నిర్మాణానికి అనుమతులు కావాలంటే 5000 చొప్పున టీడీపీ కార్యకర్తలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రశ్నించగా ఒకటి రెండు శాతం వారు అలా చేస్తూ ఉండవచ్చన్నారు. అధికారంలో ఉన్న తర్వాత ఆరోపణలు సహజమని పత్తిపాటి సమాధానం ఇచ్చారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News