అన్నంపెట్టే రైతుకు సున్నం పెట్టి... 300 కోట్ల ఆస్తులపై గల్లా కన్ను

గల్లా వారికి వేల కోట్ల విలువైన కంపెనీలు, ఆస్తులు ఉన్నాయి. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు గల్లా కుటుంబం సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో మూతపడిన గాజులమండ్యం సహకార చక్కెరఫ్యాక్టరీ ఆస్తులపై గల్లా వారు కన్నేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక పద్దతి ప్రకారం ఎప్పటిలాగే గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీని దివాళా తీయించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 13కోట్లు ఉండగా వాటిని సాకుగా చూపించి ఫ్యాక్టరీ ఆస్తులు కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్దం […]

Advertisement
Update: 2016-07-16 10:26 GMT

గల్లా వారికి వేల కోట్ల విలువైన కంపెనీలు, ఆస్తులు ఉన్నాయి. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు గల్లా కుటుంబం సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో మూతపడిన గాజులమండ్యం సహకార చక్కెరఫ్యాక్టరీ ఆస్తులపై గల్లా వారు కన్నేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక పద్దతి ప్రకారం ఎప్పటిలాగే గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీని దివాళా తీయించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 13కోట్లు ఉండగా వాటిని సాకుగా చూపించి ఫ్యాక్టరీ ఆస్తులు కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్దం చేశారు.

తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ రానున్నట్లు ముందస్తు సమాచారంతో ఈ ఫ్యాక్టరీ ఆస్తులను చేజిక్కించుకోవడానికి తన కుమారుడు, గుంటూరు ఎంపి జయదేవ్‌ ద్వారా ప్రభుత్వంపై గల్లా అరుణ ఒత్తిడి తెస్తున్నారు. ఫ్యాక్టరీని అమ్మనివ్వబోమని రైతులు హైకోర్టుకు వెళ్లినా సరే కేక్‌ లాంటి చక్కెర ఫ్యాక్టరీని కొల్లగొట్టేందుకు గల్లా కుటుంబం పావులు కదుపుతోంది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీ ఉంది. అటు పక్కనే సెల్‌ కంపెనీలు, ఐఐటి విద్యాసంస్థలు ఉండటంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఫ్యాక్టరీకి సంబంధించి 162 ఎకరాల భూములతోపాటు భవనాలు, యంత్రాల వ్యాల్యూ 300 కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు లెక్కకట్టారు. అయితే ఇదంతా ఆస్తుల కొనుగోలు కోసం పోటీ ఉంటేనే. కానీ అలాంటి పోటీ కూడా లేకుండా గల్లా కుటుంబం చేయగలిగింది.

ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మితే తానుకొంటానని ముందుగా స్థానిక మయూర షుగర్స్‌ యజమాని పోటీ పడ్డారు. కానీ గల్లా వారి దెబ్బకు ఆయన రేసు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు గల్లా జయదేవ్ లాబీయింగ్ పనిచేసి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అతి తక్కువ ధరకే ఏకపక్షంగా 300 కోట్ల ఆస్తులను కొల్లగొట్టాలని గల్లా వారు కాచుకుకూర్చున్నారు. తన వర్గానికి చెందిన కొందరు రైతులను బుట్టలో వేసుకుని ఫ్యాక్టరీ ఆస్తుల అమ్మకానికి మద్దతుగా మాట్లాడించే పనిని కూడా గల్లా కుటుంబం మొదలుపెట్టింది. మిగిలిన రైతులు మాత్రం గల్లాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం తిరిగి తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది రైతులకు మేలు చేసిన ఫ్యాక్టరీని దివాళా తీయించడమే కాకుండా ఇప్పుడు అసలు దాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు గల్లా కుటుంబం ప్రయత్నిస్తుండడం చూసి స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతులది పైచేయి అవడం ఉంటుందా?. తన వర్గానికే చెందిన గల్లా కుటుంబం కోరిక తీర్చకుండా చంద్రబాబు ఉంటారా?.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News