ఇప్పుడు లోకేష్ టార్గెట్ "టీచర్"

2004కు ముందు సీఎంగా ఉన్నచంద్రబాబు టీచర్లను శత్రువుగా చూసేవారు. తమను వేధించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని టీచర్లు బాధ‌పడేవారు. అందుకు ప్రతీకారంగానే 2004, 2009 ఎన్నికల్లో టీచర్లు టీడీపీకి వ్యతిరేకంగా రహస్య క్యాంపయిన్ చేశారని టీడీపీ నేతల అనుమానం. ఎన్నికల నిర్వాహణలోనూ టీచర్లదే కీలక పాత్ర కావడంతో ఓటింగ్‌ను కూడా వారు ప్రభావితం చేశారని టీడీపీ నేతలు వాపోయేవారు. 2014లో మాత్రం అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అయితే ఎన్నికల తర్వాత ఉద్యోగుల్లో […]

Advertisement
Update: 2016-07-11 01:28 GMT

2004కు ముందు సీఎంగా ఉన్నచంద్రబాబు టీచర్లను శత్రువుగా చూసేవారు. తమను వేధించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని టీచర్లు బాధ‌పడేవారు. అందుకు ప్రతీకారంగానే 2004, 2009 ఎన్నికల్లో టీచర్లు టీడీపీకి వ్యతిరేకంగా రహస్య క్యాంపయిన్ చేశారని టీడీపీ నేతల అనుమానం. ఎన్నికల నిర్వాహణలోనూ టీచర్లదే కీలక పాత్ర కావడంతో ఓటింగ్‌ను కూడా వారు ప్రభావితం చేశారని టీడీపీ నేతలు వాపోయేవారు. 2014లో మాత్రం అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అయితే ఎన్నికల తర్వాత ఉద్యోగుల్లో బాబుపై పెద్దగా సానుకూలత వ్యక్తం కావడం లేదు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలకు లోకేష్ రంగంలోకి దిగారు. ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహించేదీ టీచర్లే కావడంతో వారిని లోబరుచుకునేందుకు ”ఆపరేషన్ టీచర్”ను మొదలుపెట్టారు.

ఇందు కోసం లోకేష్ ఆదేశాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏఎస్‌ రామకృష్ణ రంగంలోకి దిగారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి అనుబంధంగా ఉన్నా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాన్నిబలోపేతం చేయాలని లోకేష్ ఆదేశించారని చెబుతున్నారు. ఇందుకోసం ఇతర ఉపాధ్యాయ సంఘాల్లో చీలికలు తేవడం, టీచర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని తమ సంఘంలో చేరేలా చేయడం వంటి ఎత్తులు అమలు చేస్తున్నారు. ఈ తంతు కృష్ణా జిల్లాలో ఉధృతంగా సాగుతోంది.

డీఈవో కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఏ టీచర్ ఏ పని మీద వచ్చినా, ఏ ఉపాధ్యాయ సంఘం వచ్చి కోరినా ఎలాంటి పని చేయవద్దని అధికారులను ఆదేశించారు. ఎవరైనా పని మీద వస్తే తమ వద్దకు పంపాలని టీడీపీ టీచర్ ఎమ్మెల్సీతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సూచించారు. దీంతో ఇప్పుడు డీఈవో కార్యాలయాల్లో ఏ ఉపాధ్యాయ సంఘానికి కూడా పనులు జరగడం లేదు. టీచర్లు వ్యక్తిగతంగా వస్తే అసలు విషయం చెప్పి తెలుగునాడు వైపు మళ్లిస్తున్నారు.

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తే నిబంధనలు కూడా పక్కన పెట్టి పనులు చేస్తున్నారు. ఇటీవల ఒక మహిళా టీచర్‌ డిప్యుటేషన్ విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ జోక్యం చేసుకోవడంతో ఆ విషయం వివాదాస్పదమై ఇద్దరు టీచర్లు కొట్టుకుని పోలీస్ స్టేషన్‌కు ఎక్కాల్సిన‌ పరిస్థితి వచ్చింది. లోకేష్ వద్ద మెప్పుపొందేందుకు పెనమలూరు, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలకు వెళ్లి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలో చేరాల్సిందిగా టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న వారిని ప్రలోభపెట్టి ఇప్పటికే ఉన్న సంఘాల్లో చీలికలు తెచ్చేందుకు కూడా టీడీపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

త్వరలోనే ”ఆపరేషన్ టీచర్‌”ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు చినబాబు ప్రణాళికలు రచిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ పరిణామంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలను రాజకీయ సంఘాలుగా మారిస్తే ఒకే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య సానుకూల వాతావరణం దెబ్బతింటుందని వాపోతున్నారు. అయితే తామేమీ అమాయకులం కాదని ఒకప్పుడు చంద్రబాబు ఎత్తులనే చిత్తు చేసిన చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు చినబాబు ఉచ్చు తిరిగి టీడీపీకే ఇబ్బందిగా తయారవుతుందని మరికొందరు ఉపాధ్యాయులు అంటున్నారు. చూడాలి నారా వారి విభజించు పాలించు సిద్ధాంతం… చదువులు చెప్పే టీచర్ల దగ్గర ఎంతవరకు ఫలిస్తుందో!.

click on image to read-

Tags:    
Advertisement

Similar News