"ప్రాణాలు పోయినా సరే"- కరణంకు గొట్టిపాటి సవాల్

దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఫ్యాక్షన్‌ కక్షలు ఉన్న కరణం బలరాం, గొట్టిపాటి కుటుంబాలను చంద్రబాబు ఒకే పార్టీలోకి చేర్చడంతో నిప్పు రాజుకుంటోంది. వైసీపీ నుంచి గొట్టిపాటి రవి టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత అటు కరణం బలరాం, ఇటు గొట్టిపాటి రవికుమార్‌లు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ వేడి పుట్టిస్తున్నారు. రెండు వారాల క్రితం కరణం బలరాం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్‌కే గొట్టిపాటి రవికుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన తర్వాత మీడియాలో […]

Advertisement
Update: 2016-07-10 21:13 GMT

దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఫ్యాక్షన్‌ కక్షలు ఉన్న కరణం బలరాం, గొట్టిపాటి కుటుంబాలను చంద్రబాబు ఒకే పార్టీలోకి చేర్చడంతో నిప్పు రాజుకుంటోంది. వైసీపీ నుంచి గొట్టిపాటి రవి టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత అటు కరణం బలరాం, ఇటు గొట్టిపాటి రవికుమార్‌లు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ వేడి పుట్టిస్తున్నారు. రెండు వారాల క్రితం కరణం బలరాం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్‌కే గొట్టిపాటి రవికుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన తర్వాత మీడియాలో పెద్దగా కనిపించని గొట్టిపాటి తాజా ఇంటర్వ్యూలో చాలా ఘాటుగానే మాట్లాడారు.

ఒకే పార్టీలో ఉన్నంత మాత్రాన కరణంతో కలిసి పనిచేస్తున్నారని ఎలా అనుకుంటారని గొట్టి పాటి ప్రశ్నించారు. ప్రాణం ఉన్నంత వరకు కరణంతో చేయి కలిపే ప్రసక్తే ఉండదన్నారు. మా కుటుంబంలో సొంత మనుషులను కోల్పోయాం, అనేక మంది ముఖ్యులను చంపేశారు. కాబట్టి అలాంటి వ్యక్తితో కలిసే ప్రసక్తే లేదన్నారు. కావాలంటే రాజకీయం వదిలేసి ఇంట్లో కూర్చుంటామన్నారు. తన కుటుంబసభ్యుడైన నర్సయ్య.. కరణంతో కలవడం తనకు ఇష్టం లేదన్నారు. బహుశా చంద్రబాబు మంచి ఉద్దేశంతోనే నర్సయ్య, కరణంలను కలిపిఉండవచ్చన్నారు. తన విషయంలో మాత్రం అది జరగదన్నారు. ఒకవేళ బలరాంతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితే వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

మినీ మహానాడులో ఓ పది మందిని పిలుచుకుని వచ్చి తిట్టించడం తనకు కామెడీగా అనిపించిందన్నారు. అనుభవం ఉన్న నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తుంటే నవ్వొచ్చిందన్నారు. అలా పది మందిని పిలుచుకుని వచ్చి తిట్టించడం వారి రాజకీయ దిగజారుడికి నిదర్శం అని కరణంను గొట్టిపాటి ఎద్దేవా చేశారు. కొట్టుకోవాలంటే మినిమహానాడు వేదికే కావాలా?.మరెక్కడా ప్లేస్ లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనకు పోటీగా తయారవుతాడన్న ఉద్దేశంతోనే 25ఏళ్ల గొట్టిపాటి కిషోర్‌ను హత్య చేయించారని ఆరోపించారు. అర్థరాత్రి హత్య చేసి తిరిగి వారి పొలాల్లోనే పాతిపెట్టిన విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అనేక మంది ఆచూకీలు ఇప్పటికీ కనిపించలేదన్నారు.

కనిపించకుండా పోయిన వారంతా సన్యాసుల్లో కలిసిపోయారేమోనని ఒక ఇంటర్వ్యూలో ఆయన( కరణం బలరాం) చెప్పడం చూశానని అన్నారు. వ్యక్తులను చంపేసి తిరిగి వారు సన్యాసుల్లో కలిసిపోయారేమోనని చెప్పడం బట్టే వారి అహంకారం బయటపడుతోందన్నారు. గ్రానైట్‌ గనుల్లో వంద కోట్ల జరిమానాకు భయపడే తాను టీడీపీలో చేరానని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై గొట్టిపాటి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ రికార్డులను పరిశీలించేందుకు సిద్దమని నిజంగా తాము పన్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానన్నారు. మొత్తం మీద తనపై గొట్టిపాటి ఈ రేంజ్‌లో చేసిన ఆరోపణల పట్ల కరణం ఎలా స్పందిస్తారో!.

click on image to read-

 

 

Tags:    
Advertisement

Similar News