ఇంతకూ చంద్రబాబు ఎవరు?

ఇల్లు అలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయిందంట. అట్లాగే చంద్రబాబు దేశాలు పట్టుకు తిరుగుతూ తనేంటో, తన పదవి ఏమిటో మరిచిపోయినట్లు ఉన్నాడు. గతంలో ఆయన చైనా వెళ్లినప్పుడు బుల్లెట్‌ ట్రైన్‌లు అమరావతి నుంచి విశాఖకు, అమరావతి నుంచి హైదరాబాద్‌కు నడపడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి చైనా వాళ్లతో మాట్లాడినట్లున్నాడు. ఇప్పుడు తజకిస్తాన్‌ రాజధాని ఆస్తానాకు వెళ్లి అక్కడి మేయర్‌తో ఆస్తానానుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసు నడపాలని కోరాడు. చంద్రబాబులాగా ఆస్తానా మేయర్‌ తన […]

Advertisement
Update: 2016-07-11 01:02 GMT

ఇల్లు అలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయిందంట. అట్లాగే చంద్రబాబు దేశాలు పట్టుకు తిరుగుతూ తనేంటో, తన పదవి ఏమిటో మరిచిపోయినట్లు ఉన్నాడు. గతంలో ఆయన చైనా వెళ్లినప్పుడు బుల్లెట్‌ ట్రైన్‌లు అమరావతి నుంచి విశాఖకు, అమరావతి నుంచి హైదరాబాద్‌కు నడపడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి చైనా వాళ్లతో మాట్లాడినట్లున్నాడు. ఇప్పుడు తజకిస్తాన్‌ రాజధాని ఆస్తానాకు వెళ్లి అక్కడి మేయర్‌తో ఆస్తానానుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసు నడపాలని కోరాడు.

చంద్రబాబులాగా ఆస్తానా మేయర్‌ తన స్థాయేంటో తాను మరిచిపోలేదు. అందుకే మర్యాదగా అది తన పరిధిలో లేదని ఆ దేశ రవాణాశాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పాడు.

ఇక్కడ రెండు విషయాలు:

ఒకటి- ఆస్తానా నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి ఆస్తానాకు బహుశా సంవత్సరంలో నలుగురైదుగురు ప్రయాణం చేస్తుండవచ్చు. వారికోసం రోజూ అక్కడి నుంచి ఇక్కడకు విమానం నడపమని కోరడం చూస్తే చంద్రబాబు మానసిక ఆరోగ్యంపై అనుమానం వస్తుంది.
రెండు – చైనా వాళ్లతో బుల్లెట్‌ ట్రైన్‌ గురించి చర్చించినపుడు, ఇప్పుడు ఆస్తానా మేయర్‌తో విమానం గురించి చర్చించినపుడు చంద్రబాబు తాను ప్రధానిని కాదు అనే విషయం గుర్తిస్తున్నట్లు లేదు.

2004లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయాకకూడా రెండుమూడు సంవత్సరాలపాటు ఆ విషయం ఆయనకు రిజిస్ట్రర్‌ కాలేదు. ముఖ్యమంత్రిలాగే మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్న విషయం తరచూ మర్చిపోయి ఒక దేశానికి నాయకుడిలాగా ప్రవర్తించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

click on image to read-

Tags:    
Advertisement

Similar News