చంద్రబాబు అంటే ఎందుకంత అభిమానం స్వామి?

ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన సభలో పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. ఆలయాలపై ప్రభుత్వ దండయాత్రను తీవ్రంగా తప్పుపట్టారు. అందరు స్వామీజీలు, పీఠాధిపతులు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కమలానంద భారతి స్వామి మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశామన్నారు. 2019లో మోదీ తిరిగి ప్రధాని అవుతారని… మత విశ్వసాలజోలికి రాకపోతే చంద్రబాబు కూడా తిరిగి సీఎం అవుతారని తెలిపారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ క్రైస్తవుడని ఆరోపించారు. అయితే ఒక స్వామీజీ అయి […]

Advertisement
Update: 2016-07-04 20:34 GMT

ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన సభలో పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. ఆలయాలపై ప్రభుత్వ దండయాత్రను తీవ్రంగా తప్పుపట్టారు. అందరు స్వామీజీలు, పీఠాధిపతులు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కమలానంద భారతి స్వామి మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశామన్నారు. 2019లో మోదీ తిరిగి ప్రధాని అవుతారని… మత విశ్వసాలజోలికి రాకపోతే చంద్రబాబు కూడా తిరిగి సీఎం అవుతారని తెలిపారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ క్రైస్తవుడని ఆరోపించారు. అయితే ఒక స్వామీజీ అయి ఉండి ఇలా కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం చర్చనీయాశమైంది.

కమలానంద భారతి దృష్టిలో బీజేపీ, టీడీపీకి ఓటేసేవారే హిందువులా?. ఈ రెండు పార్టీలకు కాకుండా వేరే పార్టీలకు ఓట్లేసిన హిందువులు … హిందువులు కాదా? లేక చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతం బతికిందని అనుకుంటున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ క్రైస్తవుడైతే… ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌ గ్రౌండ్ నుంచి వచ్చిన బీజేపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఏం చేస్తున్నారన్న ప్రశ్న ఎదురవుతోంది. స్పెషల్ ఆఫీసర్ తనకు తాను నేరుగా ఆ స్థానంలోకి వచ్చి ఉండరు కదా!. ప్రభుత్వమే ఆయన్ను నియమించి ఉంటుంది. అలాంటప్పుడు చంద్రబాబును, మంత్రి మాణిక్యాల రావును తప్పుపట్టాలి గానీ… ఇలా ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించే అధికారుల పేర్లను నేరుగా ప్రస్తావించి విమర్శలు చేయడం కమలానంద భారతి లాంటి వారికి తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మోదీనే గెలవాలి, చంద్రబాబే గెలుస్తాడు వంటి ప్రకటనల ద్వారా హిందూమతంలోనూ రాజకీయపార్టీల వారీగా విభజన తెచ్చినట్టు అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News