ఈ అద్బుతం అమరావతిలోనే సాధ్యం... అది కూడా బాబు ఉండబట్టే!

ఈ దేశంలో అన్ని వ్యవస్థలు చంద్రబాబుకు మోకరిల్లిన‌వేళ అమరావతి నిర్మాణంలో నియమాలు, నిబంధనలు గాల్లో కలిసిపోతున్నాయి. చిన్నపిల్లలు కూడా ముక్కున వేలేసుకునేలా స్విస్‌ చాలెంజ్ సాగుతోంది. ఏపీకి నష్టం చేకూర్చడంతో పాటు సింగపూర్‌కు అసాధారణ లాభాలు చేకూర్చేలా చంద్రబాబు చేర్చిన నిబంధనలను ఆర్థిక శాఖ కూడా వ్యతిరేకించింది. అయినా బాబు వెనక్కు తగ్గలేదు. సింగపూర్ సంస్థలకు ఇచ్చిన 1,691 ఎకరాల భూమిలో రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర […]

Advertisement
Update: 2016-07-04 21:38 GMT

ఈ దేశంలో అన్ని వ్యవస్థలు చంద్రబాబుకు మోకరిల్లిన‌వేళ అమరావతి నిర్మాణంలో నియమాలు, నిబంధనలు గాల్లో కలిసిపోతున్నాయి. చిన్నపిల్లలు కూడా ముక్కున వేలేసుకునేలా స్విస్‌ చాలెంజ్ సాగుతోంది. ఏపీకి నష్టం చేకూర్చడంతో పాటు సింగపూర్‌కు అసాధారణ లాభాలు చేకూర్చేలా చంద్రబాబు చేర్చిన నిబంధనలను ఆర్థిక శాఖ కూడా వ్యతిరేకించింది. అయినా బాబు వెనక్కు తగ్గలేదు.

సింగపూర్ సంస్థలకు ఇచ్చిన 1,691 ఎకరాల భూమిలో రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇందుకు 5,500 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఆర్‌డీఏ కోరింది. దీనికి ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. సింగపూర్ కంపెనీ 300 కోట్లు పెట్టుబడి పెడుతుంటే కేవలం 42 శాతం వాటా ఉన్న ప్రభుత్వం రూ. 5,500కోట్లు, 1,691 ఎకరాల భూమి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత డబ్బు లేదని తేల్చిచెప్పింది.

అసలు అన్ని మౌలికసదుపాయాలు ప్రభుత్వమే కల్పించిన తర్వాత ఇక సింగపూర్ కంపెనీలు ఏం చేస్తాయని ఆర్థిక శాఖ అధికారులు సీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. మరో భయంకరమైన నిబంధన ఏంటంటే… 18 నెలల కాలంలోనే రూ. 5,500 కోట్ల రూపాయల వ్యయం చేసి వసతులను కల్పించకపోతే సింగపూర్ సంస్థలకు సీఆర్‌డీఏ పెనాల్టీ చెల్లించాలనే నిబంధనకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు. దీన్ని చూసి సీనియర్ అధికారులు బిత్తరపోతున్నారు. రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థలను తొలగిస్తే అపరాధ వడ్డీ 20 శాతంతో నిధులు తిరిగి చెల్లించాలనే నిబంధన చాలా హానికరమని అధికారులు చెప్పినా చంద్రబాబు ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు.

అమరావతికే సాధ్యమైన అద్భుతం ఇదే…

ఇక్కడో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే…రాజధానిలో 58శాతం వాటా ఉన్న సింగపూర్ కంపెనీలు పెట్టే పెట్టుబడి కేవలం రూ. 300 కోట్లు మాత్రమే. చివరకు సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ. 27వేల 461కోట్లు అని తేల్చారు. 1691 ఎకరాలు సమర్పించుకోవడంతో పాటు రూ. మౌలిక సదుపాయాలకు రూ. 5, 500కోట్లు ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వానికి మాత్రం పెద్ద బొక్క మిగలనుంది. ఈ పరిస్థితిని చూసి ఆర్థిక నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. రూ. 300 కోట్లతో రూ. 27వేలకు పైగా లాభం అన్నది ఒక్క అమరావతికే సాధ్యమయ్యేలా ఉందని, అది కూడా చంద్రబాబు వల్లే సింగపూర్ కంపెనీలకు సాధ్యమవుతోందని సెటైర్లు వేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News