భూమాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జిల్లా  ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా వాయిదాలకు భూమా డుమ్మా కొడుతుండడంతో కోర్టు ఆగ్రహించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ దేవదానంను కులం పేరుతో దూషించారంటూ భూమాపై కేసు నమోదైంది. అప్పట్లో భూమా ఇంకా వైసీపీలోనే ఉన్నారు. కేవలం తనను లొంగదీసుకునేందుకే తప్పుడు […]

Advertisement
Update: 2016-07-04 11:01 GMT

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా వాయిదాలకు భూమా డుమ్మా కొడుతుండడంతో కోర్టు ఆగ్రహించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ దేవదానంను కులం పేరుతో దూషించారంటూ భూమాపై కేసు నమోదైంది. అప్పట్లో భూమా ఇంకా వైసీపీలోనే ఉన్నారు. కేవలం తనను లొంగదీసుకునేందుకే తప్పుడు కేసు పెట్టారని కూడా భూమా ఆరోపిస్తూ వచ్చారు. అనంతరం ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో కేసుల భయం కూడా ఉండదని భావించారు. అయితే అధికార పార్టీలో ఉన్నానన్న ధీమాతో కాబోలు వరుసగా మూడు వాయిదాలకు భూమా నాగిరెడ్డి గైర్హాజరవుతూ వచ్చారు. సోమవారం కూడా కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు ఆగ్రహించింది. అయితే భూమా ప్రస్తుతం అధికార టీడీపీలో ఉన్నందున నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఆయనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది అనుమానమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News