మోదీ తర్వాత చంద్రబాబుదే ఆ స్థానం

రెండేళ్లుగా పెట్టుబడుల పేరుతో ప్రత్యేక విమానాలేసుకుని విదేశాల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు మరో దేశం వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నిన్నే చైనా పర్యటన నుంచి తిరిగొచ్చిన బాబు… ఇప్పుడు రష్యా వెళ్తున్నారు. ఈనెల 10 నుంచి ఆయన రష్యాలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఎయిర్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పెట్టుబడుల కోసం చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. అయితే ఏ దేశం కూడా ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టలేదు. కేవలం తనకు అనుకూలమైన మీడియా […]

Advertisement
Update: 2016-07-01 07:01 GMT

రెండేళ్లుగా పెట్టుబడుల పేరుతో ప్రత్యేక విమానాలేసుకుని విదేశాల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు మరో దేశం వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నిన్నే చైనా పర్యటన నుంచి తిరిగొచ్చిన బాబు… ఇప్పుడు రష్యా వెళ్తున్నారు. ఈనెల 10 నుంచి ఆయన రష్యాలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఎయిర్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పెట్టుబడుల కోసం చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. అయితే ఏ దేశం కూడా ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టలేదు. కేవలం తనకు అనుకూలమైన మీడియా ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పారిశ్రామికవేత్తలు చంద్రబాబు వెంట పడుతున్నారని ప్రచారం చేయించుకోవడం మినహా స్టేట్ కు ఒరిగిందేమీ లేదు. పైగా వందల కోట్లు ప్రత్యేక విమానాల కోసం ఖర్చైపోయింది. సింగపూర్ కంపెనీలతో మాత్రం విజయవంతంగా అందరూ వ్యతిరేకించినా స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి రెండేళ్ల కాలంలో ఇన్ని సార్లు విదేశాల్లో పర్యటించిన వారెవరూ లేరని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబే రికార్డు అంటున్నారు. ప్రధాని తర్వాత అత్యధికసార్లు విదేశాలకు రెండేళ్ల కాలంలో వెళ్లిన వ్యక్తి చంద్రబాబే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News