లోకేష్‌ను లెక్కచేయని రేవంత్

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దూకుడు చూసి ఇప్పుడు టీడీపీ అధినాయకత్వమే ఆందోళనలో పడింది. ఒక విధంగా రేవంత్‌ తీరుతో పదేపదే చంద్రబాబు ఇరుకునపడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ను రేవంత్‌ పదేపదే తీవ్ర పదజాలంతో దూషించడంతో ఇదే మాటలు చంద్రబాబుకు వర్తిస్తాయి కదా అన్న ప్రశ్న వస్తోంది. ఆ పరిణామం టీడీపికి ఇబ్బందిగానే ఉంది. తాజాగా మల్లన్నసాగర్‌ నిర్వాహితుల పక్షాన రేవంత్ రెడ్డి చేసిన రెండు రోజుల దీక్ష పార్టీలో మరోసారి విభేదాలు సృష్టించిందని చెబుతున్నారు. […]

Advertisement
Update: 2016-06-29 02:21 GMT

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దూకుడు చూసి ఇప్పుడు టీడీపీ అధినాయకత్వమే ఆందోళనలో పడింది. ఒక విధంగా రేవంత్‌ తీరుతో పదేపదే చంద్రబాబు ఇరుకునపడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ను రేవంత్‌ పదేపదే తీవ్ర పదజాలంతో దూషించడంతో ఇదే మాటలు చంద్రబాబుకు వర్తిస్తాయి కదా అన్న ప్రశ్న వస్తోంది. ఆ పరిణామం టీడీపికి ఇబ్బందిగానే ఉంది. తాజాగా మల్లన్నసాగర్‌ నిర్వాహితుల పక్షాన రేవంత్ రెడ్డి చేసిన రెండు రోజుల దీక్ష పార్టీలో మరోసారి విభేదాలు సృష్టించిందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి రెండు రోజుల దీక్ష చేయాలని నిర్ణయించుకోగా… ఆ సమయంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలను పెంచింది. దీంతో మల్లన్నసాగర్‌పై దీక్షను వాయిదా వేసి… చార్జీలపెంపుపై పోరాటం చేయాలని లోకేష్‌ పార్టీ శ్రేణులకు ఆదేశించారు.

ఈ విషయాన్ని టీటీడీపీ నేతల ద్వారా రేవంత్‌రెడ్డికి కూడా తెలియజేశారు. అయితే రేవంత్‌ ఈ ఆదేశాలను లెక్కచేయలేదని చెబుతున్నారు. తెల్లవారితే దీక్షకు వెళ్లాల్సి ఉండగా ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని రేవంత్ తేల్చిచెప్పారు. దీక్ష వాయిదా వేస్తే తన వ్యక్తిత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్పష్టం చేశారట రేవంత్. దీంతో కంగుతినడం పార్టీ అధినాయకత్వం వంతు అయింది. రేవంత్ ఇలా ఏకపక్షంగా లోకేష్ ఆదేశాలను కూడా బేఖాతరు చేయడం వల్లనే… టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీనియర్ మోత్కుపల్లి లాంటివారు రేవంత్‌ దీక్షకు హాజరుకాలేదని చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్‌ గురించి లోకేష్‌కు చాలా ఫిర్యాదు వెళ్తున్నాయని చెబుతున్నారు.

తెలంగాణలో ఒక విధంగా టీడీపీ ఇమేజ్‌ను రేవంత్‌ రెడ్డి వెనక్కు నెట్టేస్తున్నారని ఆందోళన విరమించారట. పార్టీ ఇమేజ్ కంటే రేవంత్ తన సొంత ఇమేజ్‌ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే పార్టీ లైన్‌తో సంబంధం లేకుండా, చంద్రబాబుకు ఇబ్బంది వస్తుందన్న ఆలోచన లేకుండా పార్టీ ఫిరాయింపులపైనా పదేపదే రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యతిరేకులు ప్రచారం మొదలుపెట్టారు. అయితే రేవంత్ అభిమానులు మాత్రం తన లీడర్ ఇలాగే దుకూడుగా ఉండాలని కోరుంటున్నారు. పార్టీ కంటే తమకు రేవంతే ముఖ్యమన్న ఒక కేడర్‌ ఈ మధ్య పెరుగుతున్నట్టుగానూ టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. అయినా ఓటుకు నోటు కేసు గుట్టు తెలిసిన రేవంత్‌పై టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకునేంత సాహసం మాత్రం చేయకపోవచ్చు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News