టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

వివాదాస్పద వ్యక్తిగా పేరున్న విశాఖ జిల్లా అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శారదాపీఠాధిపతితో ఎందుకు వివాదం అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా… ”వాడు స్వామీజీ ఏంటండి?. అతడు వైసీపీ ప్రచారకర్త. ఎక్కడ మీటింగ్ పెట్టినా వైసీపీకి ప్రచారం చేస్తుంటాడు. సాధువంటే అర్థం తెలుసా అతడికి. “సా” అంటే సర్వంతెలిసి ఉండాలి. “దు” అంటే దుర్గుణాలు ఉండకూడదు. ఈయనకు ఆ […]

Advertisement
Update: 2016-06-26 09:36 GMT

వివాదాస్పద వ్యక్తిగా పేరున్న విశాఖ జిల్లా అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శారదాపీఠాధిపతితో ఎందుకు వివాదం అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా… ”వాడు స్వామీజీ ఏంటండి?. అతడు వైసీపీ ప్రచారకర్త. ఎక్కడ మీటింగ్ పెట్టినా వైసీపీకి ప్రచారం చేస్తుంటాడు. సాధువంటే అర్థం తెలుసా అతడికి. “సా” అంటే సర్వంతెలిసి ఉండాలి. “దు” అంటే దుర్గుణాలు ఉండకూడదు. ఈయనకు ఆ విషయం తెలుసా?. గిరిజనుల కోసం ఎవరో ఏదో చేస్తే ఈయన వెళ్లి హంగామా చేస్తారు. హుద్‌హుద్‌ సమయంలో ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా పంచలేదండి ఇతడు. వీడు ఏం దేవుడు. ఏం తెలుసు?.కనీసం హోమం చేయడం వచ్చా?. మంత్రాలు వచ్చా?. సత్యనారాయణ వత్రానికి అర్థం చెప్పమనండి చాలు. స్వరూపానందేంద్రకు మతి భ్రమించింది. వెయ్యికాళ్ల మండపం కూల్చివేయడానికి ఓటుకు నోటుకు లింక్‌ పెడుతారా?. ఏం తెలుసు?” అంటూ విశాఖ శారదా పీఠాధిపతిపై టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఒంటికాలితో లేచారు. సింహాచలం ఆలయానికి చెందిన ఏడెకరాల భూమిని పీలా గోవింద్ మరికొందరు కబ్జా చేయడంపై స్వామి స్వరూపానందేంద్ర కోర్టుకు వెళ్లారు. అందుకే ఆయనపై పీలా గోవింద్‌కు కోపమని చెబుతుంటారు.

కొద్ది రోజుల క్రితం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఒక సభలో టీడీపీ నేతల గురించి ఒక విషయం చెప్పారు. ఎన్నికల ముందు బ్రాహ్మణుల ఓట్లను ఎలా పొందాలో చెప్పాలంటూ ఇప్పటి కేంద్రమంత్రి సుజనాచౌదరి తన వద్దకు వచ్చారని వెల్లడించారు. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో బ్రాహ్మణులకు అనేక హామీలు ఇచ్చారని… తీరా గెలిచాక బ్రాహ్మణుల కోసం టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని స్వరూపానందేంద్ర విమర్శించారు. అంటే ఒక విధంగా ఎన్నికలకు ముందు స్వామిస్వరూపానందేంద్ర సరస్వతి మద్దతును టీడీపీ తీసుకుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఆయన్ను ఏకంగా వైసీపీ ప్రచార కర్త అనడంతో పాటు వ్యక్తిగతంగా దూషించడం వింతగానే ఉంది. టీడీపీ ఎమ్మెల్యే ఈ రేంజ్‌లో చేసిన వ్యాఖ్యలకు స్వరూపానందేంద్ర కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యే చాన్స్ ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News