చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సవాల్

అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో నిర్మాణాలు కుంగిపోయాయంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారిని ఎలా డీల్‌ చేయాలో తమకు తెలుసన్నారు. చంద్రబాబు ఇలా చెప్పడంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్ ఇచ్చారు. తాత్కాలిక భవనాల వద్ద నిర్మాణాలు కుంగిన విషయాన్ని నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. మీడియాను, నిపుణులను అక్కడికి ప్రభుత్వం తీసుకురావాలని … నిర్మాణాలు కుంగిన విషయాన్ని తాము నిరూపిస్తామని […]

Advertisement
Update: 2016-06-24 07:38 GMT

అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో నిర్మాణాలు కుంగిపోయాయంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారిని ఎలా డీల్‌ చేయాలో తమకు తెలుసన్నారు. చంద్రబాబు ఇలా చెప్పడంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్ ఇచ్చారు. తాత్కాలిక భవనాల వద్ద నిర్మాణాలు కుంగిన విషయాన్ని నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు.

మీడియాను, నిపుణులను అక్కడికి ప్రభుత్వం తీసుకురావాలని … నిర్మాణాలు కుంగిన విషయాన్ని తాము నిరూపిస్తామని ఎమ్మెల్యే సవాల్ చేశారు. నిపుణులు హెచ్చరించినప్పటికీ చంద్రబాబు లెక్కచేయలేదని విమర్శించారు. స్విస్ చాలెంజ్ విధానం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వమే చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు అదే దారిలో వెళ్తున్నారని మండిపడ్డారు. కేవలం తన బినామీ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే చంద్రబాబు స్విస్ చాలెంజ్ వెంటపడుతున్నారని ఆరోపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News