జగన్ ఆస్తులకేసులో మరొకరిపై విచారణ నిలిపివేత

జగన్ ఆస్తుల కేసులో నిందితులకు వరసగా ఊరట లభిస్తోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారులపై విచారణ నిలిపివేసిన హైకోర్టు… తాజాగా పునీత్ దాల్మియాపై విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కడప జిల్లాలో జయా మినరల్స్ కు కేటాయించిన సున్నపురాయి నిక్షేపాలను సజ్జల దివాకర్ రెడ్డి కంపెనీకి ఆ తర్వాత దాల్మియాకు లైసెన్స్‌లు బదిలీ అయ్యాయి. ఇలా జరగడం వల్లే జగన్ కంపెనీల్లో దాల్మియా పెట్టుబడులు పెట్టారన్నది సీబీఐ అభియోగం. దీన్ని సవాల్ చేస్తూ దాల్మియా హైకోర్టును […]

Advertisement
Update: 2016-06-21 23:25 GMT

జగన్ ఆస్తుల కేసులో నిందితులకు వరసగా ఊరట లభిస్తోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారులపై విచారణ నిలిపివేసిన హైకోర్టు… తాజాగా పునీత్ దాల్మియాపై విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కడప జిల్లాలో జయా మినరల్స్ కు కేటాయించిన సున్నపురాయి నిక్షేపాలను సజ్జల దివాకర్ రెడ్డి కంపెనీకి ఆ తర్వాత దాల్మియాకు లైసెన్స్‌లు బదిలీ అయ్యాయి. ఇలా జరగడం వల్లే జగన్ కంపెనీల్లో దాల్మియా పెట్టుబడులు పెట్టారన్నది సీబీఐ అభియోగం. దీన్ని సవాల్ చేస్తూ దాల్మియా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైవిచారణ జరిపిన న్యాయస్థానం… దాల్మియాపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చారు. సీబీఐ కోర్టులో అభియోగాల నమోదును కూడా నిలిపివేశారు. అనుమతులిచ్చిన అధికారులు, పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలపై విచారణ నిలిపివేస్తూ ఇక ఫైనల్‌గా జగన్‌ మీద కేసు మోపే అవకాశం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News