అటు పార్క్ హయత్, ఇటు దేవినేని ల్యాండ్... మా దాని మీదే వివాదం ఎందుకు?

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని అందుకే తాను పార్టీ మారినట్టు మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. తాను డబ్బు కోసం పార్టీ మారానంటే జనం నవ్వుకుంటారన్నారు. బహుశా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ అలా చేశారేమో అనిఎద్దేవా చేశారు. బంజారాహిల్స్‌లో వివాదాస్సద ఐదు ఎకరాల భూమి కోసమే పార్టీ మారినట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మూడు దశాబ్దాలుగా భూవివాదం ఉందని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు కోర్టులు కూడా తమకు అనుకూలంగా తీర్పులు చెప్పాయన్నారు. అయితే […]

Advertisement
Update: 2016-06-19 23:56 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని అందుకే తాను పార్టీ మారినట్టు మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. తాను డబ్బు కోసం పార్టీ మారానంటే జనం నవ్వుకుంటారన్నారు. బహుశా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ అలా చేశారేమో అనిఎద్దేవా చేశారు. బంజారాహిల్స్‌లో వివాదాస్సద ఐదు ఎకరాల భూమి కోసమే పార్టీ మారినట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

మూడు దశాబ్దాలుగా భూవివాదం ఉందని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు కోర్టులు కూడా తమకు అనుకూలంగా తీర్పులు చెప్పాయన్నారు. అయితే ప్రభుత్వాలు పదేపదే పిటిషన్ వేయడం వల్ల సమస్య కొనసాగుతూనే ఉందన్నారు. ఐదు ఎకరాల భూమిపై తమకు సర్వహక్కులు ఉన్నాయన్నారు. అది ప్రభుత్వ స్థలం కాదనిచెప్పారు. తమ స్థలానికి ఒక పక్క పార్క్ హయత్ హోటల్, మరో వైపు దేవినేని నెహ్రు భూమి ఉందని అలాంటప్పుడు తమది మాత్రమే ప్రభుత్వ భూమి ఎలా అవుతుందని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌లో చేరితే ఈ స్థల వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందన్న హామీతో తాను పార్టీ మారలేదన్నారు. ఏటా ఐదు వందల కోట్లు టాక్స్ చెల్లిస్తున్న కుటుంబం తమది అని చెప్పారు వివేక్. ఎంపీ సుమన్‌ను వచ్చేఎన్నికల్లో ఎమ్మెల్యేగా పంపించి, పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని వివేక్‌ కేటాయించేలా కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు వస్తున్న వార్తలపైనా వివేక్ అచితూచీ స్పందించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ దాటవేశారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీరుపైనా వివేక్ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News